అదే సమయంలో ప్రభాస్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో `సలార్` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అయ్యింది. త్వరలోనే రెండో పార్ట్ `సలార్ 2` రావాల్సి ఉంది.
`సలార్` నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధానికిది నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో `డ్రాగన్` మూవీ చేస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ `ది రాజాసాబ్`లో నటిస్తున్నారు. ఇది డిసెంబర్‌లో విడుదల కానుంది. దీంతోపాటు హను రాఘవపూడితో `ఫౌజీ` చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.
వీటితోపాటు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మలతో సినిమాలు చేయనున్నారు. అలాగే `సలార్ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది.