`కూలీ` ట్రైలర్‌ వచ్చేది అప్పుడే, ఆ రూమర్స్ కి చెక్‌.. టికెట్‌ రేట్లపై లోకేష్‌ కనగరాజ్‌ ఆందోళన

Published : Jul 15, 2025, 12:49 PM IST

రజనీకాంత్‌ నటించిన `కూలీ` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ డేట్‌ వచ్చింది. అదే సమయంలో టికెట్‌ రేట్లపై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
రజనీకాంత్‌ లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ `కూలీ`

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ ప్రస్తుతం `కూలీ` సినిమాని రూపొందిస్తున్నారు. భారీ స్టార్‌ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర వంటి బిగ్‌ స్టార్స్ నటిస్తున్నారు. 

శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది. సరిగ్గా నెల రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

25
దుమ్ములేపిన పూజా హెగ్డే `మోనికా` సాంగ్‌

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నుంచి ఇటీవలే సాంగ్‌ విడుదలైంది. పూజా హెగ్డేపై ప్రత్యేకంగా చిత్రీకరించిన `మోనికా` సాంగ్‌ని విడుదల చేశారు. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. రజనీగానీ, నాగ్‌ గానీ కనిపించలేదు. 

పూజాతోపాటు మలయాళ నటుడు సౌబిన్‌ సాహిర్‌ స్టెప్పులేసే ఈ పాట ఉర్రూతలూగించింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ పాట అటు సినిమాపై అంచనాలను పెంచడంతోపాటు ఈ పాటతో పూజా హెగ్డే కూడా పాపులర్‌ అయిపోయింది.

35
`కూలీ` మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌

`కూలీ` మూవీకి సంబంధించిన పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ ఎప్పుడు రాబోతుందనేది సస్పెన్స్ గా మారింది. ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం లేదనే పుకార్లు ఊపందుకున్నాయి. 

ఈ క్రమంలో తాజాగా దీనిపై టీమ్‌ స్పందించింది. ట్రైలర్‌ డేట్‌ని ప్రకటించింది. ఆగస్ట్ 2న `కూలీ` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. 

ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ప్రత్యాంగిర సినిమాస్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్‌ కోసం కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ చేశారు.

45
వెయ్యి కోట్లు కాదు, టికెట్‌ రేట్లపై లోకేష్‌ ఆందోళన

`కూలీ` సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో దీనిపై దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. తాను ఈ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గురించి ఆలోచించడం లేదని, కానీ ఆడియెన్స్ కి రూ.150 టికెట్‌ రేట్ల గురించి ఆందోళనగా ఉందన్నారు.

 టికెట్‌ రేట్లు ఎక్కువ ఉంటే సినిమా ఆడియెన్స్ కి దూరమవుతుందని, వారికి అందుబాటులో టికెట్‌ రేట్లు ఉండాలని ఆయన వెల్లడించడం విశేషం.

55
గోల్డ్ స్మగ్లింగ్‌ కథాంశంతో `కూలీ`

గోల్డ్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో `కూలీ` మూవీ రూపొందుతుంది. లోకేష్‌ తన ప్రతి సినిమాలో సమాజంలోని ఒక రుగ్మతని చర్చిస్తారు. గతంలో మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా, వాటిని అంతం చేయాలనే ఉద్దేశ్యంగా  సినిమాలను రూపొందించారు. మెడికల్‌ మాఫియా గురించి చూపించారు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్‌ గురించి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories