ఆమధ్య బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఆమె గెస్ట్ గా వెళ్ళి సందడి చేసింది. ఇక తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ యాడ్ లో కూడా మెరిసింది. ఇలా చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తన ఇమేజ్ ను పెంచుకుంటుంది కావ్య. తమిళనాడుకు చెందిన ఈ నటి అసలు పేరు దీపికా రంగరాజు.
ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తరువాత ఆమెకు నటన మీద ఇంట్రెస్ట్ తో, రకరకాల ప్రయత్నాలు చేసింది. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన దీపికా.. ఆతరువాత తమిళంలో చిన్నగా సీరియల్స్ లో కి ఎంట్రీ ఇచ్చింది.
తమిళంలో కొన్ని సీరియల్స్ చేసిన తరువాత తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. వచ్చీరావడంతోనే ఆమెకు స్టార్ డమ్ వచ్చింది.
Also Read: RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?