`రాబిన్‌హుడ్‌` టోటల్‌ కలెక్షన్లు, ఎంత నష్టం అంటే.. డేంజర్‌ జోన్‌లో నితిన్‌ ?

Nithiin: నితిన్‌.. ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా అలరించిన హీరో. స్టార్‌ హీరోగానూ వెలిగాడు. `జయం`, `సై`, `దిల్‌` సినిమాల టైమ్‌లో నితిన్‌ రేంజ్‌ వేరే లెవెల్‌. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, పవన్‌, మహేష్‌ బాబు స్థాయిలో రాణించారు. అంతటి పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వరుస పరాజయాలు ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తున్నాయి. స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేస్తున్న మిస్టేక్స్ ఆయన కెరీర్ పైనే ప్రభావం చూపిస్తున్నాయి. 
 
robinhood movie total collection nithiin career in danger telugu arj
Nithiin Sreeleela Robinhood movie

Nithiin: నితిన్‌ వరుసగా పది ఫ్లాప్‌ సినిమాలున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒక్క హిట్ తో అన్ని మర్చిపోయేలా చేసుకున్నాడు. హీరోగా నిలబడ్డాడు. కానీ ఈ మధ్య మాత్రం మరీ డౌన్‌ అయిపోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయాలు నితిన్‌ కెరీర్‌ని దెబ్బకొడుతున్నాయి.

ఇప్పుడు మరో మూవీ ఆయన్ని నిరాశ పరిచింది. ఇటీవల `రాబిన్‌ హుడ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు నితిన్‌. గత నెల ఎండింగ్‌లో ఈ మూవీ విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. 

robinhood movie total collection nithiin career in danger telugu arj
David Warner Robinhood

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన ఉండటంతోనైనా సినిమాకి క్రేజ్‌, వచ్చి సక్సెస్‌ అవుతుందని టీమ్‌ భావించింది. కానీ డేవిడ్‌ వార్నర్‌ ఏమాత్రం సినిమాకి హెల్ప్ కాలేకపోయారు.

సినిమాలో దమ్ములేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు. `రాబిన్‌హుడ్‌` మూవీ విషయంలో అదే జరిగింది. అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి.  

robinhood telugu movie

ఇక సినిమా విడుదలై రెండు వారాలు అవుతుంది. ఇంతకి ఇది ఎంత కలెక్ట్ చేసింది. ఎంత చేయాలి? లాభమా? నష్టమా అనేది చూస్తే. ఈ మూవీ రెండు వారాల్లో సుమారు రూ. 13కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. 7కోట్ల షేర్‌ వచ్చింది.

సినిమా బిజినెస్‌ 28 కోట్లు కాగా, వచ్చిన కలెక్షన్లు పోతే 21కోట్లు నష్టం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. వారికి బిగ్‌ లాస్‌ అని చెప్పొచ్చు. 

nithiin

read  more: ఒక్క ఫైట్‌ లేకుండా సినిమా చేసి బాక్సాఫీసుని షేక్‌ చేసిన బాలయ్య, ఆ మూవీ ఏంటో తెలుసా? అందరికి షాక్‌

also read: ఒక్క మాటతో జయలలిత ప్రభుత్వాన్ని కూల్చేసిన రజనీకాంత్‌.. తలైవీతో సూపర్‌ స్టార్‌ గొడవ ఏంటో తెలుసా?
 
Latest Videos

vuukle one pixel image
click me!