ప్రియాంక చోప్రా ఫ్యాషన్‌ను పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతుంది. దాని కోసం చాలా ఖర్చు చేస్తుంది. ఆమె ఉపయోగించే ప్రతి వస్తువులో ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతే కాదు ఆమె వాడే వస్తువుల చాలా కాస్ట్ ఉంటాయి. ఆమె వస్తువులు కోట్లలో ఉంటాయి. ఇక ఈమద్య ముంబయ్ లో తన ఆస్తులను కూడా కోట్లకు అమ్మేస్తోంది ప్రియాంక.
ప్రియాంక బాలీవుడ్‌లో సినిమాలు తగ్గించి హాలీవుడ్‌కు వెళ్లింది. హాలీవుడ్ నటుడు, పాప్ సింగర్ నిక్ జానస్ ను ప్రేమించి పెళ్ళాడింది. అక్కడే సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తోంది. ఆమె ఆస్తులు దాదాపు 700 కోట్లు ఉంటాయని అంచనా. లాస్ ఏంజల్స్ లో ఆమె 100 కోట్లతో ఇల్లు కట్టుకుంది.