సినిమాలను వదిలేస్తున్నా .. దళపతి విజయ్ సంచలన ప్రకటన

Published : Dec 28, 2025, 10:49 AM IST

మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో జరిగిన 'జన నాయగన్' సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌లో దళపతి విజయ్  సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి సినిమాలను వదిలేస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ ఏమన్నారంటే?

PREV
15
దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్..

సౌత్ స్టార్ హీరో  విజయ్ సంచలన ప్రకటన చేశారు. జననాయగన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఆయన ప్రసంగం అందరిని ఆకర్శించింది.  తనదైన శైలిలో అభిమానులను చూస్తూ.. 'అయ్యా, రాజా... నా గుండెల్లో నివసించే స్నేహితులకు, స్నేహితురాళ్లకు నమస్కారం' అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కొన్ని సినిమాల పేర్లు వింటే మలేషియానే గుర్తొస్తుందిి, ముందుగా మన స్నేహితుడు నటించిన 'బిల్లా' అని విజయ్ అనగానే..  స్టేడియం ఈలలతో దద్దరిల్లింది. అజిత్ సినిమా గురించి విజయ్ మాట్లాదటంతో. అభిమానులు దిల్ ఖుష్ అయ్యారు.  ఆ తర్వాత తన సినిమాలైన 'కావలన్', 'కురువి' గురించి విజయ్ మాట్లాడారు.

25
అభిమానులు నన్ను ప్యాలెస్ లో కూర్చోబెట్టారు..

విజయ్ మాట్లాడుతూ… " శ్రీలంక తర్వాత మలేషియాలోనే ఎక్కువ మంది తమిళ ప్రజలు ఉన్నారు. నాకు ఏదైనా అయితే థియేటర్లలో నిలబడతారు. వాళ్ల కోసం రాబోయే 30-33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్, అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నాడు. నేను ఒక చిన్న  ఇల్లు కట్టుకోవాలనే ఆశతో సినిమాలోకి వచ్చాను. కానీ మీరు నన్ను ప్యాలెస్‌లో కూర్చోబెట్టారు. వరదలో కొట్టుకుపోతున్న వాడికి మీరు పడవ ఇస్తే, ఎడారిలో మీరు దాహంతో ఉన్నప్పుడు అది ఒంటెలా మీకు సహాయం చేస్తుంది. నేను అదే చేయబోతున్నాను అని అన్నారు.

35
జననాయగన్ గురించి విజయ్ కామెంట్స్

ఈ సినిమాలో తనతో పనిచేసిన వారి గురించి విజయ్ మాట్లాడుతూ, మమిత కేవలం 'డ్యూడ్' మాత్రమే కాదు, ఈ సినిమా తర్వాత ప్రతి కుటుంబంలో ఒక చెల్లిగా నిలిచిపోతుంది. దర్శకుడు హెచ్. వినోద్ సమాజంపై ప్రభావం ఉన్న దర్శకుడు. మేమిద్దరం ముందే కలిసి పనిచేయాల్సింది. దానికోసం చర్చలు కూడా జరిగాయి. అప్పుడు కుదరలేదు. అదృష్టవశాత్తూ ఈ సినిమాతో కలిశాం.

45
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి మాట్లాడుతూ..

విజయ్ మాట్లాడుతూ.. ‘’సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. కానీ నాకు, ప్రకాష్ రాజ్ గారికి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. 'గిల్లి'తో మొదలై ఇప్పటికీ అది కొనసాగుతోంది. అనిరుధ్ ఒక మ్యూజికల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్. అక్కడ అన్‌లిమిటెడ్‌గా మ్యూజిక్ దొరుకుతుంది. అతను మనల్ని ఎప్పుడూ నిరాశపరచడు. నా సినిమాలకే కాదు, ఏ నటుడి సినిమాకి సంగీతం ఇచ్చినా అది హిట్టే.

55
బలమైన శత్రువు కావాలి..

జీవితంలో గెలవడానికి మంచి స్నేహితులు అవసరం లేదు. బలమైన శత్రువు కావాలి. బలమైన శత్రువే మిమ్మల్ని బలంగా మారుస్తాడు. నేను మొదటి రోజు నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాను. కానీ నా అభిమానులు 33 ఏళ్లుగా నాతోనే నిలబడ్డారు. నా కోసం నిలబడిన వాళ్ల కోసం ఇప్పుడు నేను నిలబడబోతున్నాను అని అన్నారు.

ఆ తర్వాత విజయ్‌ కి  ఒక ప్రశ్న ఎదురయ్యింది.  'సినిమాలో మీరు వదిలి వెళ్తున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు?' అని యాంకర్లు అడగ్గా, 'ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో ప్రజలకు తెలుసు, వాళ్లే చూసుకుంటారు' అని విజయ్ సమాధానమిచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories