మహేష్ బాబు కి టెన్షన్ వస్తే ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా? సీక్రెట్ రివిల్ చేసిన సూపర్ స్టార్

Published : Dec 28, 2025, 11:40 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు టెన్షన్ వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒకప్పుడు సినిమా రిలీజ్ టైమ్ లో.. టెన్షన్ తట్టుకోలేకపోతే సూపర్ స్టార్ కు రిలీఫ్ ఇచ్చిన ఉపాయం ఏంటో తెలుసా? 

PREV
15
జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాడు. చేసేది ఏడాదికి ఒక్క సినిమా.. అది కూడా తన అభిమానులను అలరించే విధంగా ఉండాలి అనేది మహేష్ బాబు ఆలోచన. అందుకే కథ నుంచి కథనం వరకూ.. తన పాత్ర దగ్గర నుంచి హీరోయిన్ వరకూ.. అన్ని విషయాలలో ఆయన కేర్ తీసుకుంటున్నారు. అందేకే ఈ మధ్య కాలంలో మహేష్ ఖాతాలో ప్లాప్ లు ఉండటంలేదు. శ్రీమంతుడు సినిమా నుంచి వరుసగా సక్సెల్ లు చూస్తున్నాడు సూపర్ స్టార్.

25
సినిమా రిలీజ్ అంటే టెన్షన్..

మహేష్ బాబు ఇప్పుడు ఇంత జాగ్రత్తగా ఉన్నారు.. కానీ ఒకప్పుడు ఆయన చేసిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అది రిలీజ్ అయ్యి.. హిట్ టాక్ తెచ్చుకునే వరకూ టెన్షన్ ఉండేది. అది చాలా కాలం ఫేస్ చేశాడట మహేష్. ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందంటే.. తరువాత ఒక డిజాస్టర్..పడుతుండటంతో.. చాలా నిరాశకు గురయ్యాడు మహేష్ బాబు.. సీతమ్మ వాకిట్లో సినిమా హిట్ అయితే.. బ్రహ్మోత్సవం డిజాస్టర్, దూకుడు బ్లాక్ బస్టర్ అయితే.. ఆగడు అట్టర్ ఫ్లాప్.. ఇలా మహేష్ చాలా కాలం ఇబ్బంది పడ్డారు.

35
టెన్షన్ పోడానికి అమ్మ చేతి కాఫీ..

మహేష్ బాబు ఒకప్పుడు సినిమా రిలీజ్ ఉంది అంటే.. వెంటనే రిలీజ్ ముందు రోజు తన తల్లి దగ్గరకు వెళ్లేవారట. ఆమె చేతితో ఒక్క కాఫీ తాగి రిలీలాక్స్ అయితే.. ఆ టెక్షన్ అంా పారిపోయేదట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ.. ఈ విషయాలు వెల్లడించారు మహేష్. '' అమ్మ చేత్తో కాఫీ తాగితే.. ఎన్నిటెక్షన్లు ఉన్నా.. పారిపోయేవి. ఆమె ఎప్పుడూ.. షూటింగ్ లొకేషన్స్ కు వచ్చేవారు కాదు.. కానీ ఫస్ట్ టైమ్.. అమ్మ వంశీ సినిమా షూటింగ్ కు మాత్రం వచ్చారు..'' చాలాసేపు ఉన్నారని.. మహేష్ వెల్లడించారు.

45
మహేష్ బాబు అమ్మమ్మ కూచి..

మహేష్ బాబుకు బాలకృష్ణ నుంచి ఒక ప్రశ్న ఎదురయ్యింది.. ఇంట్లో నువ్వు బాగా అల్లరి చేసేవాడివట కదా.. మరి అమ్మ చేతిలో తన్నులు తిన్నావా అని బాలయ్య అడిగారు. దానికి మహేష్ బాబు సమాధానం చెపుతూ.. '' లేదు అమ్మ నన్ను ఎప్పుడూ కొట్టలేదు.. తిట్టలేదు కూడా, నాన్న కూడా అంతే. కానీ అమ్మమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆమె దగ్గరే నేను పెరిగాను. ఆమె ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో.. ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.'' అని మహేష్ బాబు అన్నారు. దాంతో బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరూ అమ్మ కూచీలు అయితే.. నువ్వు మాత్రం అమ్మమ్మ కూచీవి అని అన్నారు.

55
వారణాసి బిజీలో మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం.. దాదాపు 1500 కోట్ల వరకూ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారని అంచన. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 2027 సమ్మర్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories