Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?

Published : Sep 04, 2026, 08:59 AM IST

Bigg Boss Telugu Winners: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లు పూర్తి చేసుకుని, 10వ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ 9 సీజన్ల విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అందులో ఇద్దరు సామాన్యులు కూడా ఉన్నారు. మరి వారి సంగతేంటి?

PREV
15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు సన్నాహాలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి అంతా సిద్ధమైంది. ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే రెండుసార్లు సామాన్యులుగా అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ టైటిల్ విన్నర్స్‌గా బయటకు వచ్చారు. ఈసారి బిగ్ బాస్ అంతకుమించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్‌గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు. మరి ఆ 9 సీజన్ల విన్నర్స్ ఏం చేస్తున్నారు? వారిలో బిగ్ బాస్ ఎవరికి కలసొచ్చింది? ఎవరు ఎక్కడున్నారు? కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

కళ్యాణ్ పడాల..

సామాన్యుడిగా బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి.. స్టార్‌గా ఎదిగాడు కళ్యాణ్ పడాల. ఆర్మీలో పనిచేసిన కళ్యాణ్.. బిగ్ బాస్‌లో తన ఆటిట్యూడ్‌తో, బిహేవియర్‌తో ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా నిలిచాడు. ₹40 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు రెమ్యునరేషన్, కారు, ప్లాట్ గెలుచుకున్న కళ్యాణ్.. కొంతకాలం కామ్‌గా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే అతను టీవీ ప్రోగ్రామ్స్‌లో బిజీ అవుతున్నాడు. హీరోగా కూడా సినిమాలు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తన గెటప్ అంతా మార్చేశాడు.

25
నిఖిల్ మలియాకల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఈ సీజన్‌లో చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడని చాలామంది భావించారు. అయితే అందుకు భిన్నంగా నిఖిల్ మలియాకల్ విజేతగా నిలిచాడు. గౌతమ్ రన్నరప్‌గా నిలవగా, నిఖిల్‌కు ట్రోఫీతో పాటు ₹55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించారు. నిఖిల్ కూడా ఇప్పుడిప్పుడే తెలుగులో యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. కొన్ని టీవీ సిరీస్‌లు చేస్తున్నాడు. మరోవైపు అతను కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగులో కొన్ని వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు.

పల్లవి ప్రశాంత్ వివాదాలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి సామాన్యుడిగా అడుగు పెట్టి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. సామాన్యుల కోటాలో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టినా.. ఆయన యూట్యూబర్‌గా, రైతుబిడ్డగా అంతకుముందే ఫేమస్ అయ్యాడు. హౌస్‌లోకి వచ్చిన ప్రశాంత్ తన ఆటతీరుతో భారీ చర్చకు కారణమయ్యాడు. టైటిల్ గెలిచిన తర్వాత అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అతని అభిమానులు చేసిన గోలకు పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు కూడా అరెస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ గెలిచిన తర్వాత ప్రశాంత్ బాగా రిచ్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన ఆటిట్యూడ్ చూపిస్తూ.. వ్యాపారాల్లో నిమగ్నమై రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని సమాచారం. గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడంటూ... అతనిపై విమర్శలు కూడా వైరల్ అయ్యాయి.

35
సింగర్ రేవంత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఈ సీజన్‌లో శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడు. నిజానికి విన్నర్ కావలసిన శ్రీహాన్.. ముందే ఊహించలేక ₹40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని బయటకు రావడంతో టైటిల్‌ను కోల్పోయాడు. రేవంత్ బిగ్ బాస్ గెలిచిన తర్వాత పెద్దగా కనిపించలేదు. గతంలో అయినా కొన్ని కార్యక్రమాల్లో కనిపించేవాడు. బిగ్ బాస్ తర్వాత రేవంత్ అంతగా యాక్టివ్‌గా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్. బిగ్ బాస్ టైటిల్ వల్ల అతనికి ప్రత్యేకంగా వచ్చిన అవకాశాలేమీ లేవనే చెప్పాలి.

వీజే సన్నీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి మోడలింగ్, సినిమాల్లో చిన్న పాత్రలు, సీరియల్స్‌లో నటించాడు. ‘కళ్యాణ వైభోగం’ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సన్నీకి అదే బిగ్ బాస్ అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే హైదరాబాద్‌లో రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించినట్లు సమాచారం.

45
అభిజిత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అభిజిత్ విజేతగా నిలిచాడు. హౌస్‌లో చాలామంది అతనికి వ్యతిరేకంగా ఉన్నా, ప్రేక్షకుల సపోర్ట్‌తో ఒంటరి పోరాటం చేసి గెలిచాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో పాపులర్ అయిన అభిజిత్, బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో బిజీ అవుతాడని భావించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ట్రావెలర్‌గా దేశవిదేశాలు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్‌లోకి సామాన్యులను పంపడానికి టీమ్ ప్రారంభించిన ‘అగ్నిపరీక్ష’కు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. స్టార్ యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫోక్ సింగర్‌గా గుర్తింపు పొందిన రాహుల్‌కి బిగ్ బాస్ తర్వాత అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు. రాహుల్ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో పాడిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో రాహుల్ పాపులారిటీ మరింతగా పెరిగింది. రీసెంట్‌గా ఓ రాజకీయ నాయకుడి కుమార్తెను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఓ లవ్ స్టోరీ.. బయట మరో లవ్ స్టోరీ నడిపించాడనే విమర్శలు కూడా ఉన్నాయి.

55
కౌశల్ మంద

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కౌశల్ మంద విజేతగా నిలిచాడు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో భారీ హడావుడి కూడా చేశారు. వివాదాస్పద విన్నర్‌గా కౌశల్ నిలిచాడు. ఈ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించగా, కౌశల్ కారణంగా నానిపై కూడా విమర్శలు వచ్చాయి. గెలిచిన తర్వాత కొంతకాలం వార్తల్లో నిలిచిన కౌశల్, ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. రీసెంట్‌గా ‘కన్నప్ప’ సినిమాలో సందడి చేశాడు కౌశల్. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 10 కోసం జరుగుతున్న ‘అగ్నిపరీక్ష 2’పై కూడా కౌశల్ విమర్శలు చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేత – శివబాలాజీ

2017లో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్ విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివబాలాజీ.. బిగ్ బాస్ గెలిచిన తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. ఇటీవల ‘కన్నప్ప’ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం శివబాలాజీ ‘మా’ (MAA) అసోసియేషన్‌లో మంచు విష్ణు టీమ్‌లో మెంబర్‌గా కొనసాగుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories