Megastar: చిరంజీవి తనతో 26 సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్‌తో పెద్ద గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు. సరిగ్గా అదే టైమ్‌లో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందో తెలుసా? ఇంతకీ ఎవరా హీరోయిన్?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, వర్సటైల్ నటి రాధికా శరత్‌కుమార్‌ల కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సుమారు 26కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం, స్నేహబంధం ఉంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధిక తమ సినీ ప్రయాణం, షూటింగ్ సమయంలో జరిగిన సరదా గొడవలు, చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
25
చిన్నపిల్లల్లా గొడవలు
మెగాస్టార్ చిరంజీవి, రాధిక చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. చీటికిమాటికి తగవులాడుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కూడా. ఈ క్రమంలో 'అభిలాష' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను రాధిక గుర్తుచేసుకున్నారు. "యురేకా" పాట చిత్రీకరిస్తున్నప్పుడు చిరంజీవికి, తనకు మధ్య చిన్నపాటి వివాదం జరిగి కొన్ని రోజుల పాటు మాటలు బంద్ అయ్యాయని రాధిక అన్నారు. ఆ సమయంలో స్కూల్ పిల్లల్లా ఇద్దరం చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవాళ్లమని నవ్వుతూ చెప్పారు.
35
సరేఖ సపోర్ట్ ఎవరికి?
సరిగ్గా అప్పుడే షూటింగ్ సెట్‌కి వచ్చిన సురేఖ (చిరంజీవి భార్య) మధ్యలో రెఫరీగా వ్యవహరిస్తూ, "రాధిక చాలా చిన్నపిల్ల, తనతో ఎందుకు గొడవపడతారు?" అని చిరంజీవికి నచ్చజెప్పేవారట. గొడవ పడిన రెండు మూడు రోజులకే మళ్లీ ఏమీ జరగనట్లు సాధారణంగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయిపోయేవాళ్లమని రాధిక అన్నారు.
రాధిక మాట్లాడుతూ.. ''మేమిద్దరం ఒకే సమయంలో పరిశ్రమలోకి వచ్చి ఎదిగాము, అందుకే మా మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఈ ఫ్రెండ్‌షిప్ వల్లే ఎక్కడ కలిసినా, వేడుకల్లో, పబ్లిక్ ఈవెంట్లలో చాలా క్లోజ్‌గా ఉంటాము.. మా ఇద్దరి లాంగ్వేజ్ మాకే అర్థమవుతుంది. చిరంజీవి నన్ను ఎప్పుడూ సరదాగా రౌడీ అని ఆటపట్టిస్తుంటారు, కానీ నేను చాలా మంచి అమ్మాయిని'' అని రాధిక సరదాగా వ్యాఖ్యానించారు.
55
చిరంజీవి ఎదుగుదలపై గర్వం
చిరంజీవి స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్‌గా మారిన విధానం పట్ల రాధిక అపారమైనఅభిమానం, గర్వం వ్యక్తం చేశారు. "చిరంజీవి చేసినంత కష్టపడే స్వభావం, అంకితభావం ఉన్న నటుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఆయన పడే కష్టమే ఆయన్ను ఈ స్థాయికి తీసుకెళ్లింది" అని రాధిక కొనియాడారు. ఇప్పటికీ చిరంజీవి నటించిన ఏదైనా సినిమా నచ్చితే వెంటనే ఫోన్ చేసి తన ఆనందాన్ని, గర్వాన్ని పంచుకుంటానని చెప్పారు. అంతేకాకుండా, రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా చూసిన తర్వాత కూడా ఎంతగానో ముచ్చటపడ్డానని, తాము చూస్తూ పెంచిన చిన్నపిల్లలు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ రాధిక ఆనందం వ్యక్తం చేశారు.