ఈక్రమంలోనే.. ఈ ఫార్ములాలో భాగంగానే.. బిగ్ బాస్ స్టేజ్ ఎక్కబోతున్నారట నాగచైతన్య -శోభిత. రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ అయ్యింది.. పెళ్ళిడేట్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. దాంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు మారుమోగుతోంది. ఈ జంట కనిపిస్తే.. ఆ ఈవెంట్ పక్కాగా జనాలకు ఎక్కుతుంది. అందుకే వీరిద్దరిని బిగ్ బాస్ స్టేజ్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారట. అంతే కాదు ఒక రోజు మంచి అకేషన్ చూసుకుని.. హౌస్ లోకి పంపించి మంచి ఈవెంట్ కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నారట.