Bigg Boss Telugu 8: బిగ్‌ బాస్‌ విన్నర్‌ కంటే వాళ్లకి దక్కే పారితోషికమే ఎక్కువా?.. ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

First Published | Aug 31, 2024, 12:00 PM IST

బిగ్‌ బాస్‌ విన్నర్‌ కంటే ఎక్కువ పారితోషికం ఎవరికి ఇస్తారో తెలుసా? అసలు నిజాలు తెలిస్తే ఫ్యూజులు ఎగిపోవాల్సిందే. ఈ విషయం తెలిస్తే టైటిల్‌ విన్నర్‌ పెద్ద బకరా అయిపోతాడేమో. 
 

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 ప్రారంభానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. అందరు ఎదురుచూస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఒక్క రోజులో ప్రారంభం కాబోతుంది. పలు ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్, కొంత వివాదం మధ్య ఎనిమిదో సీజన్‌ ఆదివారం సాయంత్రం ఏడుగంటల నుంచి(సెప్టెంబర్‌ 1) గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది. దాదాపు మూడు  గంటలపాటు  ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది స్టార్‌  మా. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌, స్టార్‌ మాలో ఈ షో రన్‌ కానున్న విషయం తెలిసిందే. డిస్నీ లో గతంలో లైవ్‌ని  కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించబోతున్నట్టు తెలుస్తుంది. దీని వల్ల లైవ్‌లో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వారి నిజ స్వరూపాలు ఎలా ఉంటాయనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. 

Bigg boss telugu 8

హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఈ సారి పలు ఎగ్జైట్‌మెంట్లతో రాబోతుంది. అంతా ఊహించని విధంగా జరగబోతుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌ అని నాగ్‌ ప్రోమోల్లో వెల్లడించారు. అదే సమయంలో ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని కూడా తెలిపారు. అదే ఈ సారి ప్రత్యేకత అని, ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. మరి అలాంటి  సంఘటనలు  ఏం జరగబోతున్నాయనేది ఇప్పుడు  ఆసక్తికరంగా  మారింది. ఈ పాయింట్‌ ఇప్పుడు  ఆడియెన్స్ లో మరింత  క్యూరియాసిటీని పెంచుతుంది. 
 

Latest Videos


ఇదిలా ఉంటే  బిగ్‌ బాస్‌లో కంటెస్టెంట్లకి సంబంధించి ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పారితోషికాలకు సంబంధించిన అంశం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కంటే ఆ కంటెస్టెంట్లకి పారితోషికం ఎక్కువగా ముడుతుందనేది దీని  సారాంశం. మరి అలాంటి కంటెస్టెంట్‌ ఎవరు,  ఎందుకు వాళ్లకి ముడుతుందనేది చూస్తే, ఇందులో లాజికల్‌ పాయింట్‌  పెద్దగానే ఉంది. బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌కి  ఇచ్చే పారితోషికం రూ. 50లక్షలు. అయితే  ఈ  యాభై లక్షలు డైరెక్ట్ గా  ఆయనకు ముట్టదు. ఇందులో జీఎస్‌ కట్‌ చేస్తారు. అలా ఒప్పుడు 13లక్షలు కట్‌  అయ్యేవి.  అంటే 37 లక్షలే విన్నర్‌కి దక్కేవి. ఇటీవల కేంద్రం కొత్త జీఎస్టీ విధానాలు  తీసుకొచ్చింది. దీంతో 20 లక్షలకు పైగా కట్‌ అవుతాయని సమాచారం. అంటే 46 శాతం జీఎస్టీ కట్‌ అవుతుంది. ఇలా పోతే ఫైనల్‌గా విన్నర్‌కి దక్కేది రూ.27లక్షలే అని సమాచారం. 

Bigg boss telugu 8

మామూలు కంటెస్టెంట్‌, పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్‌ని తీసుకొచ్చారంటే.. వాళ్లకి 15వేల నుంచి 18వేల వరకు రోజుకి పారితోషికంగా ఇస్తారు. ఈ లెక్కన వాళ్లకి 15 వారాలకు దక్కేది మరో 20 లక్షల వరకు వస్తాయి. విన్నింగ్‌ ప్రైజ్‌మనీతో కలిపితే 45-47లక్షల వరకు అందుతాయి. మొత్తంగా వీరికి అందే పారితోషికం ఇంతే. అదే మధ్యలో టాప్‌ 5 కంటెస్టెంట్లో ఎవరైనా నాగార్జున ఇచ్చే  ఆఫర్‌కి టెంప్ట్ అయి వెళ్లిపోయారంటే అందులోనే కోత పడుతుంది. 35 లక్షలకు జీఎస్టీ పోతే 20 లక్షల వరకు అందుతుంది. అతని పారితోషికం కలిస్తే సుమారు 38-40 లక్షలు మాత్రమే పారితోషికంగా అందుతాయి. ఇది విన్నర్‌ కి అంతిమంగా దక్కే అమౌంట్‌. 
 

Bigg boss telugu 8

అదే పాపులర్‌ కంటెస్టెంట్‌ అనుకోండి, బాగా క్రేజ్‌ ఉండి, సినిమా సెలబ్రిటీలా ఉండి, భారీ ఫాలోయింగ్‌ ఉన్న కంటెస్టెంట్‌ అయితే వాళ్లకి పారితోషికం రోజుకి 40-50వేల వరకు ఉంటుంది. ఇలాంటి కంటెస్టెంట్లు దాదాపు 15 వారాలు ఉంటాయి. అలా ఉంటే వీరికి దక్కే అమౌంట్‌ 45 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో జీఎస్టీ అనేది  డైరెక్ట్ గా కట్‌ కాదు. వైట్‌,  బ్లాక్‌ రూపంలో ఈ అమౌంట్‌ వెళ్తుందని సమాచారం. దీంతో ఇందులో టాక్స్ కట్టింగ్‌ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ లెక్కన బిగ్‌  బాస్‌ విన్నర్‌ కంటే ఇలాంటి  రేర్‌ కంటెస్టెంట్లకి ఎక్కువ పారితోషికం దక్కుతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే విన్నర్‌కి ఆఫర్లు ఉంటాయి. కొన్ని కంపెనీలు  కారు,  గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌ ఫ్లాట్లు ఇస్తుంటారు. అవి విన్నర్‌కి దక్కే ఎక్ట్ర్సా  బెనిఫిట్స్. పారితోషికాల విషయంలో  చూస్తే  విన్నర్‌ కంటే  క్రేజీ కంటెస్టెంట్లే తోపులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

click me!