ఇండస్ట్రీలో పాలిటిక్స్, ఉదయ్ కిరణ్ అందుకే మరణించాడు, బిగ్ బాస్ ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్!

First Published Oct 8, 2024, 4:51 PM IST

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఆదిత్య ఓంకి ఉదయ్ కిరణ్ సమకాలీన నటుడు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ మరణం పై ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. 
 

నటుడు ఆదిత్య ఓం ఉత్తర్ ప్రదేశ్ వాసి. దర్శకుడు వైవిఎస్ చౌదరి నటుడిగా పరిచయం చేశాడు. 2002లో విడుదలైన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో హీరోగా నటించాడు. ఇది ఫ్యామిలీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. సుమన్, వినీత్, హరికృష్ణ సైతం ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్. ఆదిత్య ఓం కి జంటగా అంకిత నటించింది.

Aditya Om

లాహిరి లాహిరి లాహిరిలో విజయం సాధించడంతో ఆదిత్య ఓం కి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. అల్లరి నరేష్ తో ధనలక్ష్మి ఐ లవ్ యూ టైటిల్ తో ఓ మల్టీస్టారర్ చేశాడు. ఇది ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. అనంతరం ఆదిత్య ఓం చేసిన చిత్రాలేవీ పెద్దగా ఆడలేదు. 

నటన నుండి డైరెక్షన్ వైపు వెళ్ళాడు. సడన్ గా బిగ్ బాస్ తెలుగు 8లో ప్రత్యక్షం అయ్యాడు. ఆదిత్య ఓం పెద్దగా రాణించలేదు. అతడు వివాదాలకు దూరంగా ఉండేవాడు. సాఫ్ట్ యాటిట్యూడ్ వలన గేమ్ పరంగా తన మార్క్ చూపించలేకపోయారు. తెలుగు పూర్తిగా రాకపోవడం కూడా ఆదిత్య ఓం కి మైనస్. ఐదవ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వచ్చాడు. 

Latest Videos


Aditya Om

తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ మరణంపై స్పందించారు. ఉదయ్ కిరణ్ సక్సెస్ఫుల్ హీరో. విజయాలు సాధించాడు. అలాంటి హీరో ఫెయిల్యూర్స్ తట్టుకోలేకపోయాడు. సినిమాలు లేకపోతే... అందరూ అడుగుతారు. బయటకు వెళితే..  మీరు ఎందుకు సినిమాలు చేయడం లేదు? ఎందుకు మీ సినిమాలు ఆడటం లేదు? అని అంటారు. 

నటులకు మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. నేను హీరోగా ఫెయిల్ అయినా.. దర్శకత్వం వైపు వెళ్ళాను. అసలు నేను పరిశ్రమకు దర్శకుడిగానే వచ్చాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ సినిమాలో, సీరియల్స్ లో చేసుకోవచ్చు. కానీ హీరో మాత్రం హీరో పాత్రలే చేయాలి. ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు. నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే మరణించాడు.. అని అన్నారు. 
 

టాలీవుడ్ లో రాజకీయాలు ఉన్నాయా అంటే... రాహుల్, ఆకాష్, తరుణ్, నేను ఇలా కొందరు యంగ్ హీరోలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దానికి గాడ్ ఫాదర్, గైడెన్స్ లేకపోవడం కూడా కారణం. అదే సమయంలో పరిచయాలు కూడా కావాలి... అన్నారు. పరోక్షంగా పరిశ్రమలో ఎదగాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలని చెప్పకనే చెప్పాడు. 

ఉదయ్ కిరణ్ మరణం అత్యంత విషాదకరం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఉదయ్ కిరణ్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. చిత్రం ఆయన డెబ్యూ మూవీ. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్. రెండో చిత్రం కూడా తేజ దర్శకత్వంలో చేశాడు. నువ్వు నేను బ్లాక్ బస్టర్ కొట్టింది. దాంతో ఉదయ్ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. 
 


మూడో చిత్రం మనసంతా నువ్వే కూడా భారీ విజయం రాబట్టింది. హ్యాట్రిక్ విజయాలతో ఉదయ్ కిరణ్ స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అనంతరం నటించిన కలుసుకోవాలని, శ్రీరామ్, నీస్నేహం సైతం పర్లేదు అనిపించాయి. అనంతరం ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ వివాహం జరగాల్సింది. దాదాపు ఖాయం అనుకున్న సమయంలో వివాహం రద్దు చేసుకున్నారు. అనంతరం మరొక అమ్మాయితో ఉదయ్ కిరణ్ వివాహం జరిగింది. కెరీర్ నెమ్మదించాక భార్యతో కూడా ఆయనకు విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది. 

click me!