వాళ్లకు బుద్ది చెప్పాలనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, కానీ.. పవన్ కళ్యాణ్ కి అవమానం

First Published Oct 8, 2024, 3:15 PM IST

నేను బ్రూస్ లీ ఫిల్మ్ లు చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను. అప్పటిదాకా నాకు ఫారినర్స్ మాత్రమే మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకుంటారనే భ్రమలో ఉన్నాను. 

pawan kalyan, martial arts, chiranjeevi, power star

 పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనగానే మనకు మార్షల్‌ ఆర్ట్స్‌ గుర్తుకు వస్తుంది. పవన్ కు పూర్తి స్దాయిలో కూడా మార్షిల్ ఆర్ట్స్  నైపుణ్యం ఉంది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన  తన తొలి సినిమా అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి మొదలుకుని రీసెంట్ గా హరిహర వీరమల్లు దాకా చాలా సినిమాల్లో ఎక్కడో ఒక చోట తన మార్షల్‌ ఆర్ట్స్‌ ట్యాలెంట్‌ను చూపిస్తూనే ఉన్నారు.ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆ విషయాలు తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. తమిళంలో ఇచ్చిన ఇంటర్వూలో మార్షిల్ ఆర్ట్స్ ప్రస్తావన వచ్చింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

pawan kalyan, martial arts, chiranjeevi, power star


పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ..చెన్నైతో తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా తాను మైలాపూర్ లో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న మార్షిల్ ఆర్ట్స్ ట్రైనర్ దగ్గరకు వెళ్లేవాడిని, మా టీచర్ శ్రీ హాన్ హుస్సేన్ అన్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఆ ట్రైనర్ ఇంటర్వూలు వెతకటం మొదలెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  అలాగే పవన్ మార్షిల్ ఆర్ట్స్ చేసిన స్టిల్స్, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

Latest Videos


pawan kalyan, martial arts, chiranjeevi, power star


గతంలోనూ ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టర్ కు ఇచ్చిన పవన్ మాట్లాడుతూ...మా అన్నయ్య నాగబాబుకు మార్షిల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. నెల్లూరులో కరాటే నేర్చుకున్నారు. నన్ను కూడా నేర్చుకోమంటే కామెడీ చేసాను. అయితే నేను బ్రూస్ లీ ఫిల్మ్ లు చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను. అప్పటిదాకా నాకు ఫారినర్స్ మాత్రమే మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకుంటారనే భ్రమలో ఉన్నాను. 


నేను నా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు నా అన్నయ్య చిరంజీవి సినిమాలను ఫన్ చేసేవారు నా క్లాస్ మేట్స్.  మా అన్నయ్య ఫైట్స్ ని కామెడీ చేసేవాళ్లను గట్టిగా కొట్టాలనిపించింది. అయితే నాకా ధైర్యం లేదు. ఎందుకంటే నేను చాలా వీక్ గా ఉండేవాడిని. నా కోపాన్ని కంట్రోలు చేసుకోలేకపోయేవాడిని. ఆ టైమ్ లోనే నేను మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకుని వాళ్లకు బుద్ది చెప్పాలనిపించి, అటు వైపు ప్రయాణం పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 

మన కోపాన్ని కంట్రోలు చేసుకోలేకపోతే..చిన్న చిన్న తప్పులకు కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతాము. కానీ మార్షిల్ ఆర్ట్స్ నాకు సెల్ఫ్ కంట్రోలు చేసుకోవటం నేర్పింది. మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకున్నాక నాకు నేను ప్రపంచాన్ని చూసే కోణం మారింది. దెబ్బలాటలకు దూరం గా ఉన్నాను. కోపం వ్యక్తం చేయటం అంటే తిరగబడి కొట్టడం కాదని తెలుసుకున్నాను. అదే నాకు మార్షిల్ ఆర్ట్స్ చేసిన పెద్ద ఉపకారం అన్నారు పవన్. 

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

పవన్ మార్షల్ ఆర్ట్స్ గురువు షెహాని హుస్సేన్ మాట్లాడుతూ...  “1990లో నేను కరాటే నేర్పటం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపటంలో బిజీగా ఉండేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ దాదాపు నెల పాటు నా దగ్గరకు రోజూ వచ్చి కరాటే నేర్పమని అడిగేవారు. నేను ఏజన్సీ పనుల్లో బిజీగా ఉండేవాడిని.

నేను ఈ మధ్యన కరాటే నేర్పించడం మానేశాను అని వెళ్లిపోమన్నాను.  కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారు.  అంతేకాదు  పవన్ కళ్యాణ్ ఓ సామాన్యమైన వ్యక్తిలాగ టీ తెచ్చి పెట్టి మాకు ఇచ్చేవారు. 

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau


నేను అతని ట్యూటర్ గా చాలా గౌరవంగా చూసి ఏ పని  పడితే అది చేసేవారు. కొన్నిసార్లు మా రూమ్ క్లీన్ చేసేవారు. మాతో పాటు ఉండేవారు. అలా ఏడాదిపాటు ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అప్పటికి పవన్ చిరంజీవి తమ్ముడనే విషయం తమకి తెలియదు అన్నారు.

 “దాదాపు మూడు నాలుగు నెలలు ఓ సామాన్య వ్యక్తిలా మా దగ్గర మార్షిల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుని తను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మాకు మాకు అసలు విషయం తెలిసింది. ఆయన మెగాస్టార్ తమ్ముడు కల్యాణ్ కుమార్ అని.  అలాగే పవన్ చాలా వేగంగా మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అతనో స్పెషల్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చారు. మా దగ్గర ఉండగానే బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు అని చెప్పారు. 


ఇక  హరిహర వీరమల్లు సినిమాలో క‌థానుగుణంగా వీర‌మ‌ల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య అవ‌స‌ర‌మైనందున.. దీనికోసం ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు పవన్. ఈ సినిమా ద్వారా త‌న‌లోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని మరోసారి చూపించ‌బోతున్నారు పవన్‌. అందుకు తగ్గట్లే ట్రైన‌ర్‌తో క‌లిసి పవన్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది చిత్ర టీమ్. కాగా 17వ శతాబ్దంలో మొగ‌లుల కాలం నాటి కథతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్ పవన్‌ సరసన నటించనుంది. అలాగే బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నర్గీస్‌ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. 
 

click me!