బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ప్రేమ జంటలు, బయటకు వెళ్లాక షాక్ ఇచ్చిన లవ్ బార్డ్స్ ఎవరు?

Published : Sep 19, 2025, 04:46 PM IST

బిగ్ బాస్ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం 9వ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే ప్రతీ సీజన్ లో లవ్ స్టోరీస్ కామన్ అయిపోయాయి. తాజా సీజన్ లో  కూడా ఒక లవ్ స్టోరీ నడుస్తోంది.  ఇక గత సీజన్లలో లవ్ స్టోరీల విషయానికి వస్తే.? 

PREV
17
బిగ్ బాస్ ప్రేమ జంటలు

నాలుగు గోడల మధ్య అందమైన అమ్మాయిలు అబ్బాయిలు వారాల తరబడి కలిసి జీవిస్తే ప్రేమలు పుట్టకుండా ఉంటాయా? బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం జరిగేది అదే. ప్రతీ సీజన్ లో ఏదో ఒక లవ్ స్టోరీ బయటకు వస్తోంది. అందులో కొన్ని ఘాడ ప్రేమలు ఉంటే.. మరీకొన్ని లైట్ తీసుకున్న ప్రేమ ప్రేమకథలు ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పవన్ కళ్యాణ్ రీతు చౌదరి మధ్య జరుగుతున్నది తెలిసిందే. మరి సీజన్ అయిపోయే వరకూ ఎవరి మధ్య ఎంత ఘాడమైన ప్రేమ ఉంటుందో చూడాలి.

27
రాహుల్ సిప్లిగంజ్ –పునర్నవి భూపాలం

ఈ సీజన్‌ విజేత రాహుల్. అతను పునర్నవితో కలసి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్నాడు. హౌస్‌లో వారి సన్నిహితత్వం ప్రేమగా మారిందన్న ప్రచారం జరిగింది. హౌస్‌ బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ప్రస్తుతం పునర్నవి లండన్‌లో చదువుకుంటోంది. రాహుల్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.

37
అఖిల్ – మోనాల్,

సీజన్ 4లో రెండు జంటలు ప్రముఖంగా ప్రాచుర్యం పొందాయి. అఖిల్ సార్థక్-మోనాల్ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. మోనాల్ అయితే త్యాగాలు కూడా చేసింది. అభిజీత్ ఎంత ట్రై చేసినా మోనాల్ మాత్రం అఖిల్ కి కనెక్ట్ అయ్యింది. అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడు.

47
అభిజిత్ – హారిక

బిగ్ బాస్ తెలుగు 4లో అవతరించిన మరో ప్రేమ జంట అభిజిత్-హారిక. వీరు హౌస్లో ఉండగా బయట పేరెంట్స్ మధ్య పెళ్లి చర్చ కూడా వచ్చింది. ఫ్యాన్స్ ఇద్దరి పేరున ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. టైటిల్ కొట్టిన అభిజీత్ మాత్రం బయటకు వచ్చాక హారిక చెల్లితో సమానం అని ఝలక్ ఇచ్చాడు.

57
షణ్ముఖ్ – సిరి హన్మంత్

ఈ జంట ప్రేమ బంధానికి హౌస్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. వారి ముద్దులు, హగ్గులు, గొడవల తో ఆ సీజన్ అంతా రచ్చ రచ్చ చేశారు. ఈ విషయంలో పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యాయి. సిరి వల్లే షణ్ముఖ్, దీప్తీ సునైన మధ్య బ్రేకప్ అయ్యిందని టాక్ ఉంది.

ఆర్జే సూర్య – ఇనాయా సుల్తానా

ఈ జంట హౌస్‌లో కలిసికట్టుగా కనిపించారు. ఇనాయా ఓపెన్‌గా “సూర్య నా క్రష్” అంటూ చెప్పడంతో అప్పటి నుంచి వీరి ప్రేమ కథ బయట బాగా పాపులర్ అయ్యింది. నాగార్జున హెచ్చరికల అనంతరం, ఆర్జే సూర్య ఎలిమినేట్ కావడంతో ఇనాయా భావోద్వేగానికి లోనయ్యింది. ఇక సింగర్ శ్రీరామ్ , హమీదా మధ్య రిలేషన్ హౌస్‌లో స్టెడీగా సాగింది. కానీ హమీదా త్వరగా ఎలిమినేట్ కావడంతో ప్రేమకు ముగింపు పలికినట్టు అయ్యింది.

67
గౌతమ్ – యష్మి - నిఖిల్

ఇక బిగ్ బాస్ హౌస్ లో డబుల్ లవ్ స్టోరీ నడిపిన ఘనత గౌతమ్ కే దక్కుతుంది. సీజన్ 7 లో శుభశ్రీకి లైన్ వేశాడు గౌతమ్. ఆమె కూడా లైట్ గా సిగ్నల్ ఇచ్చింది. బంధం బలపడే లోపు శుభశ్రీ 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. దాంతో ప్రేమకథకు ఫుల్ స్టాప్ పడింది. ఇక మరోసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ యష్మి గౌడకు ఒక రకంగా ప్రపోజ్ చేసినంత పనిచేశాడు. యష్మి మాత్రం నిఖిల్ ను ఇష్టపడింది. చివరకు నిఖిల్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో హౌస్ లో ఆమె పడిన బాధ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్, యష్మీల ప్రేమ కథ హైలెట్ గా నిలిచింది. ఇదే సీజన్ లో విష్ణు ప్రియ పృథ్వీని వన్ సైడ్ లవ్ చేయడం తెలిసిందే. వీరి స్టోరీ కూడా హౌస్ లో రచ్చ రచ్చ అయ్యింది.

77
విష్ణు ప్రియ – పృథ్వీ (వన్ సైడ్ లవ్)

విష్ణు ప్రియ పృథ్వీపై వన్ సైడ్ లవ్ సీజన్ కే హైలెట్ అయ్యింది. పృథ్వీ తనకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా అతని వెనకాల పడి ఫ్రెండ్షిప్ చేసింది విష్ణు. వివరకు వీరి ప్రేమ కూడా బయటకు వచ్చాక వర్కౌట్ అవ్వలేదు. ఇలా బిగ్ బాస్ లో మరికొన్ని ప్రమ కథలు హైలెట్ అయ్యాయి. 

Read more Photos on
click me!

Recommended Stories