మహేశ్ బాబు వదిలేసిన బ్లాక్ బస్టర్.. అల్లు అర్జున్ కెరీర్ లో మైల్ స్టోన్

Published : Sep 19, 2025, 03:21 PM IST

Mahesh Babu – Allu Arjun : సూపర్ స్టార్ మహేష్ బాబు వదిలేసిన ‘రేసుగుర్రం’ అల్లు అర్జున్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తొలిసారి ₹50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు.

PREV
15
మహేష్ బాబు వద్దన్న కథ.. బన్నీ కెరీర్‌ను మార్చేసింది

Mahesh Babu – Allu Arjun: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న వయసులో బాలనటుడుగా వెండితెరపై అడుగుపెట్టారు. పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించి నటనలో తనదైన ముద్ర వేశారు. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మ్యాన్, శ్రీమంతుడు వంటి సినిమాలు మహేశ్ బాబు స్టార్‌డమ్‌ ను మరింత పెంచాయి. యూత్‌ఫుల్ లవర్ బాయ్ నుండి యాక్షన్ హీరో వరకు అన్ని షేడ్స్‌లోనూ మెప్పించి టాలీవుడ్ లో "సూపర్ స్టార్" గా గుర్తింపు తెచ్చుకున్నారు.

25
మహేష్ బాబు వదులుకున్న ‘రేసుగుర్రం’

టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో మహేష్ బాబు హిట్ల సంఖ్య గణనీయమే అయినా, ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు కూడా వేరే హీరోలకు బ్లాక్‌బస్టర్ హిట్లను అందించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘రేసుగుర్రం’. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి, మొదట హీరో క్యారెక్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్‌గా డిజైన్ చేశారట. అయితే ఆ సమయంలో మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ సినిమాకు సమయం ఇవ్వలేకపోయారట. డేట్స్ ఇబ్బందిగా మారడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట.

35
అల్లు అర్జున్ కెరీర్ లో మైల్ స్టోన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి డేట్స్ రాకపోవడంతో సురేందర్ రెడ్డి అదే కథను అల్లు అర్జున్‌కి వినిపించారు. మాస్, కామెడీ, యాక్షన్, బ్రదర్ సెంటిమెంట్ మిళితమైన ఈ కథ బన్నీకి బాగా నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా పట్టాలెక్కించారు. ‘రేసుగుర్రం’ విడుదలైన వెంటనే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైల్, శృతిహాసన్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అన్ని కలిసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తొలిసారి ₹50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. స్టార్ హీరోల రేసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

45
మహేష్ చేసి ఉంటే?

ఒకవేళ ఈ సినిమా మహేష్ బాబు చేతిలో ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్నదానిపై అభిమానుల్లో తరచూ చర్చ జరుగుతుంది. కానీ చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆ పాత్ర బన్నీకి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యిందనే విషయం వాస్తవం. అదే కారణంగా సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. మహేష్ బాబు వదిలేసిన ‘రేసుగుర్రం’ అల్లు అర్జున్ కెరీర్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమాతో బన్నీ స్టార్‌డమ్ మరో స్థాయికి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

55
రాజమౌళితో గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్

ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ నవంబర్‌లో మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఒక లుక్ పోస్టర్ కూడా షేర్ చేశారు. 2027లో విడుదల కానున్న ఈ భారీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories