Bhadrakaali Movie Review: `భద్రకాళి` మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Sep 19, 2025, 04:43 PM IST

Bhadrakaali Movie Review: విజయ్‌ ఆంటోని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ `భద్రకాళి`(శక్తి తిరుమగ). ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`భద్రకాళి` మూవీ రివ్యూ

విజయ్‌ ఆంటోని నెమ్మదిగా హీరోగా ఎదుగుతున్నాడు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తున్నారు. మంచి సందేశాత్మక పాయింట్‌కి కమర్షియల్‌ హంగులు అద్ది సినిమాలు రూపొందిస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ తన సినిమాలు విడుదలవుతుంటాయి. దీంతో తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతున్నాడు విజయ్‌. తాజాగా ఆయన `భద్రకాళి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇందులో ఆయనకు జోడీగా తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించారు. అరుణ్‌ ప్రభు దర్శకుడు. ఈ మూవీని తన విజయ్‌ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై విజయ్‌ ఆంటోనినే నిర్మించారు. తెలుగులో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ విడుదల చేశారు. శుక్రవారం(సెప్టెంబర్‌ 19న) విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూ(Bhadrakaali Movie Review)లో తెలుసుకుందాం.

26
`భద్రకాళి` మూవీ కథః

కిట్టు(విజయ్‌ ఆంటోని) పొలిటికల్ లాబీయిస్ట్. సెంట్రల్‌ నుంచి, స్టేట్‌ వరకు ఏ శాఖలోనైనా లాబీయింగ్‌ చేయించగలడు. సీఎం నుంచి, కేంద్ర మంత్రుల వరకు మ్యానేజ్‌ చేయగలడు. అన్నిశాఖలు తన కంట్రోల్లో ఉంటాయి. అధికారులు, రాజకీయ నాయకుల వల్ల కాని పని కిట్టు చేయగలడు. అవసరం అయితే డీజీపీ పోస్ట్ కూడా ఇప్పించగలడు, అదే సమయంలో మర్డర్స్ చేయించగలడు. అధికారులకు పోస్టింగ్‌లు, ట్రాన్స్ ఫర్లు, బినామీ వ్యవహరాలు, ప్రమోషన్స్, హవాలా ఇలా అన్నీ చేయగలడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి పారలల్‌గా ఒక వ్యవస్థనే నడిపిస్తుంటాడు. ఆయన సమక్షంలోనే వందల కోట్లు చేతులు మారుతుంటాయి. తాను కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో లాబీయింగ్‌ చేస్తాడు. అది పెద్ద వారికి అనుమానం వస్తుంది. అయితే ప్రభుత్వాలు, కార్పొరేట్లు అంతా పొలిటికల్‌ మాస్టర్‌ మైండ్‌ అభ్యంకర్‌ (సునీల్‌ కిర్పలాని) కంట్రోల్‌లో నడుస్తుంటాయి. ఆయన చెప్పిందే రాజకీయ నాయకులు చేస్తారు. ఓ దశలో చోటు చేసుకునే అనూహ్య పరిణామాలు పెద్దవాళ్లకి అనుమానాలను క్రియేట్‌ చేస్తాయి. దీంతో ఆరా తీయగా దీని వెనకాల కిట్టు హస్తం ఉందని, ఆయనే ఇదంతా చేస్తున్నాడని తెలుస్తుంది. వేల కోట్ల స్కామ్‌ బయటపడుతుంది. దీంతో కిట్టుపై అనేక కేసులు పెట్టి అరెస్ట్(Bhadrakaali Movie Review) చేస్తారు. కిట్టుని విచారించగా, పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. దాని వెనకాల ఆయన పగ ఉంది. వ్యవస్థపై నిస్సాహయత ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రపతి కాబోతున్న అభ్యంకర్‌ని అడ్డుకోవాలని, ఆయన నిర్మించిన రాజకీయ కోటని కూల్చేయాలనే పగ ఉంటుంది. కిట్టు ఎందుకు అభ్యంకర్‌ని టార్గెట్‌ చేశాడు? ఇంతకి కిట్టు ఎవరు? ఎలా ఎదిగాడు? తన వెనక ఎవరున్నారు? ప్రభుత్వ వ్యవస్థలను ఆయన ఎలా ఆడుకున్నాడు? వేల కోట్ల స్కామ్‌ చేయడానికి కారణమేంటి? చివరికి ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ డ్రామాకి కిట్టు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేది మిగిలిన కథ.

36
`భద్రకాళి` మూవీ విశ్లేషణః

విజయ్‌ ఆంటోని సినిమా అంటే కమర్షియల్‌ అంశాలతోపాటు మంచి సందేశం ఉంటుంది. అది పేదలకు సంబంధించినది కావచ్చు, వ్యవస్థలోని లోపాలు కావచ్చు. పొలిటికల్‌ వ్యవహారాలు కావచ్చు. ఇలా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ బేస్‌తో చాలా సినిమాలు వచ్చాయి. పొలిటికల్‌ లాబీయింగ్ తో మన తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి. అదే ఇందులో(Bhadrakaali Movie Review) కొత్త పాయింట్‌. అయితే ప్రారంభంలో కాస్త ఎగ్జైటిగ్‌గా నడుస్తుంది. ఆ తర్వాత రకరకాలుగా టర్న్ తీసుకుంటుంది. కిట్టు ఎంట్రీ, ఆయన లాబీయింగ్‌ చేసే పనులు క్రేజీగా ఉంటాయి. కింది స్థాయి అధికారి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూడా ప్రభావితం చేసి తన వద్దకు వచ్చిన వారికి పనులు చేయిస్తుంటారు. అయితే తాను పనిచేసిపెట్టినందుకు భారీగానే పుచ్చుకుంటాడు. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ప్రారంభంలో ఎంగేజ్‌ చేస్తాయి. దీనికితోడు విజయ్‌ ఆంటోని పాత్ర ఎలివేషన్లు ఆకట్టుకున్నాయి. నీట్‌గా స్క్రీన్‌ ప్లే సాగుతుంది. ఎలాంటి హగ్గులు ఆర్భాటాలు ఉండవు. అదే ఇందులో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఫస్టాఫ్‌ వరకు బాగానే సాగింది. కాస్త రేసీగానూ అనిపిస్తుంటాయి. కిట్టు వేసే ప్లాన్స్, ఆయన అందరిని మ్యానేజ్‌ చేసే తీరు, వ్యవస్థలను మ్యానేజ్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సమాజంలోని రియాలిటీని ప్రతిబింబించేలా రూపొందించారు. అన్ని సాఫీగా జరిగినప్పుడు ఏ గొడవ ఉండదు, ఏదైనా తేడాగా జరుగుతున్నప్పుడే మొదటికే మోసం వస్తుంది. వేర్లతో సహా మొత్తం లేచిపోవాల్సిందే. ఈ మూవీలో ఆ తర్వాత కిట్టు పరిస్థితి కూడా అలానే అవుతుంది. పెద్ద స్థాయిలో అనుమానం రావడం, దానికి కారణం కిట్టు అని తెలియడంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. అంతకు ముందు సలామ్‌ కొట్టిన పెద్దలు కూడా ఏరా, పోరా అనే పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు, అధికారులు, కార్పొరేట్లు ఇలా అంతా ఒక్కటైపోతారు. బ్రోకర్స్, లాబీయిస్టులే బకరా అవుతారు. ఇందులో అదే జరిగింది. ఇంటర్వెల్‌ వరకు ఉన్నంతలో ఆసక్తికరంగా సాగుతుంది.

46
`భద్రకాళి` మూవీ విశ్లేషణః

ఇంటర్వెల్‌ తర్వాత కథ మొత్తం నెమ్మదిస్తుంది. కిట్టు గతం గురించి చెప్పే సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అదే సమయంలో చాలా లెంన్తీగా చూపించారు. ఏమాత్రం హీరో పాత్రలో పెయిన్‌ కనిపించదు. ఎమోషన్స్ క్యారీ అవలేదు. ఇన్వెస్టిగేషన్‌, కిట్టు గురించి ఆరా తీయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. ఆ తర్వాత హీరో పాత్ర సిస్టమ్‌ గురించి, తన గురించి చెప్పడానికే ప్రయారిటీ ఇచ్చారు. వ్యవస్థలోని లోపాలను చెప్పడం అనేది కూడా చాలా సేపు ఉంటుంది. ఇవే విషయాలు గతంలో తన సినిమాల్లో అటు ఇటుగా చెప్పారు విజయ్‌. ఇందులోనూ అవే చూపించారు. దీంతో రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. ఆయా సీన్లు స్లోగా సాగుతాయి. దీంతో ఆసక్తి తగ్గిపోతుంది. క్లైమాక్స్ లో కిట్టు పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా అంతగా పేలలేదు. సప్పగా సాగుతుంది. సీన్లకి తగ్గ హై మూమెంట్స్ లేవు. పైగా రొటీన్‌గానే ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఏం చూపించాలనుకునేది క్లారిటీ మిస్‌ అయ్యింది. కిట్టు పగని చూపించాలనుకున్నారా? వ్యవస్థలోని లోపాలను చూపించాలనుకున్నారా? ప్రభుత్వంలో తెరవెనుక ఎలాంటి లాబీయింగ్‌లు జరుగుతాయనే చెప్పదలుచుకున్నారా? రాజకీయ నాయకులు ఏంచేస్తారనేది చెప్పదలుచుకున్నారా? స్కామ్‌ల గురించి బయటపెట్టాలనుకున్నారా? పేదవాళ్లని ఆదుకునే ప్రయత్నమా? అనే క్లారిటీ మిస్‌ అయ్యింది. దీంతో సెకండాఫ్‌ కథనం వివిధ రకాలుగా మలుపులు తిరుగుతుంది. చివరికి అర్థాంతరకంగా కథని ముగించినట్టుగా ఉంటుంది. దీంతో సినిమా లక్ష్యం లేని జర్నీగా, కన్‌ క్లూజన్‌ లేని ముగింపులా అనిపిస్తుంది.

56
`భద్రకాళి` మూవీ నటీనటులుః

కిట్టు పాత్రలో విజయ్‌ ఆంటోని బాగా నటించాడు. ఆయన ఎలివేషన్లు ప్రారంభంలో బాగున్నాయి. సెటిల్డ్ గా ఆయన కనిపించిన తీరు బాగుంది. విజయ్‌ ఆంటోని చాలా సినిమాల్లో సీరియస్‌గానే కనిపిస్తాడు. ఇందులోనూ అలానే కనిపించాడు. ఇక ఆయన భార్యగా తృప్తి రవీంద్ర ఫర్వాలేదనిపించింది. అభ్యంకర్‌ పాత్రలో సునీల్‌ కిర్పలాని నటించాడు. చాలా బాగా చేశారు. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక స్పెషల్‌ ఆఫీసర్‌ రామ్‌ పాండేగా కిరణ్‌ అదరగొట్టాడు. చాలా సహజంగా నటించాడు. విజయ్‌ పక్కన అసిస్టెంట్‌గా ఉన్న పాత్రధారి అదరగొట్టారు. మిగిలిన పాత్రలు మెప్పించాయి.

66
`భద్రకాళి` మూవీ టెక్నీషియన్ల పనితీరు

షెల్లీ కాలిస్ట్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. మంచి కూల్‌ ఫీలింగ్‌ని తెస్తాయి. సెకండాఫ్‌లో ఎడిటింగ్‌ ఇంకా షార్ప్ చేయాల్సింది. విజయ్‌ ఆంటోని మంచి మ్యూజిక్‌ని అందించారు. ప్రారంభం నుంచి బీజీఎం అదిరిపోయింది. చాలా కొత్తగా ఉంది. అదే సినిమాకి పెద్ద ప్లస్‌. ఇక దర్శకుడు అరుణ్‌ ప్రభు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగానే ఉంది. కాకపోతే ఏం చెప్పదలచుకున్నాడనేదాంట్లో క్లారిటీ మిస్‌ అయ్యింది. సినిమాని నడిపించిన తీరు బాగుంది. చాలా బ్రిలియంట్‌గానూ ఉంది. తెలుగు డైలాగ్‌లు బాగున్నాయి. డబ్బింగ్‌ కూడా సహజంగా ఉంది. కాకపోతే చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పాడు. తెలుగులోనూ, విజయ్‌ ఆంటోని సినిమాల్లోనూ ఇలాంటి ఎలిమెంట్లతో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో ఇందులో కొత్తదనం మిస్‌ అయ్యింది. పైగా స్లోగా సాగడం కూడా పెద్ద మైనస్‌. ట్విస్ట్, టర్న్ లో కిక్‌ మిస్‌ అయ్యింది. అవి ఆశించిన స్థాయిలో పండలేదు. దీంతో ఇది ఏమాత్రం ఆకట్టుకోలేని పొలిటికల్‌ థ్రిల్లర్‌గా మారిపోయింది.

ఫైనల్‌గాః ఆకట్టుకోలేకపోయిన పొలిటికల్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌ డ్రామా `భద్రకాళి`.

రేటింగ్‌ః 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories