శోభా శెట్టి తనకి పోటీగా దివ్యని ఎంచుకుంది ఈ టాస్క్ లో దివ్య విజయం సాధించింది. ఆ తర్వాత హౌస్ లోకి సోహైల్ ఎనెర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు. తన తరుపున ఇంటి సభ్యుల కోసం చికెన్, పలు, కాఫీ పంపాలని బిగ్ బాస్ ని ఆర్డర్ చేశాడు. పంపండి బిగ్ బాస్ లేకుంటే వీళ్ళ ముందు నా ఇజ్జత్ పోతుంది అంటూ బతిమాలుకున్నాడు. కానీ బిగ్ బాస్ నిజంగానే సోహైల్ ఇజ్జత్ తీశాడు. చికెన్ ఫోటో ఉన్న పేపర్, కాఫీ ఫోటో ఉన్న పేపర్, మిల్క్ ఫోటో ఉన్న పేపర్ పంపాడు. కానీ ఆ తర్వాత సోహైల్ కోరిక మేరకు నిజంగానే చికెన్, మిల్క్, కాఫీ పంపారు. సోహైల్ తో టాస్క్ లో సంజన, రీతూ ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో సంజన, రీతూ ఇద్దరూ విజయం సాధించారు. హౌస్ లో చివరి కెప్టెన్ కావడానికి జరిగే పోటీ కోసం కంటెండర్లుగా కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజన, రీతూ అర్హత సాధించారు. దీనితో బిగ్ బాస్ వారిని అభినందించారు.