గంటకు రేటెంత అని అడుగుతున్నారు.? స్టార్ హీరోయిన్ ఆవేదన.. ఎవరంటే.?

Published : Nov 27, 2025, 08:33 PM IST

Girija Oak: గిరిజా ఓక్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ రీసెంట్‌గా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయింది. చీరకట్టులో ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.  

PREV
15
ఓవర్ నైట్ స్టార్ అయింది..

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు హాట్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. కానీ మీరెప్పుడైనా చూశారా.! చీర కట్టుకుని ఉన్న ఓ ఫోటోతో వైరల్ అవ్వొచ్చునని.. ఎస్.! అది కరెక్టే.. ఓ స్టార్ హీరోయిన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చీరకట్టుతో.. తెగ ఫేమస్ అయింది. ఆమె మరెవరో కాదు.. గిరిజా ఓక్.

25
చీరకట్టులో కుర్రకారు ఫిదా

ఇటీవల ఈమె మరాఠీ స్వీట్ గురించి చెబుతూ.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో నీలి రంగు చీరతో కనిపించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంత పాపులారిటీ వస్తే.. ఏ నటికైనా ఆఫర్లు వస్తాయి. కానీ ఈమెకు లేనిపోని తలనొప్పులు వచ్చాయి. ఆ విషయాలను పంచుకుంటూ.. ఆమె తన బాధ చెప్పుకుంది.

35
ఒక్క ఇంటర్వ్యూతో సెన్సేషన్..

ప్రస్తుతం గిరిజా ఓక్ పేరు అటు మరాఠీ సినిమాలోనే కాదు, సోషల్‌ మీడియాలో కూడా తెగ మారుమ్రోగుతోంది. ఎప్పటినుంచో సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల భామ.. ఇప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా తెగ సెన్సేషన్ అయింది. లేటు వయసులో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ పాపులారిటీ, ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టకపోగా.. నెగటివ్ కామెంట్స్ చాలానే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

45
నెగటివ్ కామెంట్స్ తో టార్చర్..

గంటకు నీ రేటెంత? అని కొంతమంది ఆకతాయిలు కామెంట్లు, మెసేజ్‌లు చేస్తున్నారని.. గంటసేపు నీతో గడపాలంటే ఎంత తీసుకుంటావ్‌? అని ఇంకొంతమంది సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది. నన్ను ఇలా దూషించి, తక్కువ చేసి మాట్లాడేవాళ్లు ఆన్‌లైన్‌ చాటున చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

55
సందీప్ కిషన్ తో సినిమా..

‘తారే జమీన్‌ పర్‌’, ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’, ‘సైకిల్‌ కిల్‌’, ‘కాలా’, ‘జవాన్‌’, ‘ది వ్యాక్సిన్‌ వార్‌’, ‘ఇన్‌స్పెక్టర్‌ జండే’ వంటి హిందీ సినిమాల్లో నటించింది గిరిజా ఓక్. ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’ సినిమాలో సందీప్ కిషన్‌తో రొమాన్స్‌ చేసిన పలు వీడియోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories