ఇటీవల యాంకర్ శివజ్యోతి తిరుమల ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో టీటీడీ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. టీటీడీ తీసుకున్న చర్యల వల్ల శివజ్యోతికి ఇకపై తిరుమలలో ప్రవేశం లేకుండా పోయింది.
బిగ్ బాస్ సెలబ్రిటీ, యాంకర్ శివజ్యోతి వరుసగా ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్యన బెట్టింగ్ యాప్స్ వివాదంలో శివజ్యోతి పేరు బలంగా వినిపించింది. అది సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో శివజ్యోతి ఫ్యామిలీ మొత్తం అతిపెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. శివజ్యోతి, ఆమె భర్త, సోదరుడు ఇటీవల తిరుమలకి వెళ్లారు.
25
ప్రసాదాన్ని అపహాస్యం చేసిన శివజ్యోతి
రూ.10000 టికెట్ ద్వారా శ్రీవాణి క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు శివజ్యోతి, ఆమె సోదరుడు తిరుమల ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. తిరుమలలో ప్రసాదం అడుక్కుంటున్న రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ వెకిలి నవ్వుతో కామెంట్స్ చేశారు. శివజ్యోతి ఇలా ప్రవర్తించడం పవిత్రమైన తిరుమలని అవమానించడమే అని, హిందువుల మనోభావాలు దెబ్బ తీయడమే అని భక్తులు భావించారు.
35
క్షమాపణ కోరిన శివజ్యోతి
శివజ్యోతి, ఆమె సోదరుడు తిరుమల ప్రసాదాన్ని అపహాస్యం చేయడమే కాక దానిని రీల్స్ కూడా చేశారు. దీనితో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. శివజ్యోతిపై టీటీడీ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఈ వ్యవహారం టీటీడీ బోర్డు వరకు వెళ్లడంతో పరిణామాలు మరింత సీరియస్ అయ్యాయి. శివజ్యోతి సోషల్ మీడియాలో బహిరంగంగా క్షమాపణలు కోరింది. తనకి వెంకటేశ్వర స్వామిపై ఎంతో భక్తి ఉందని, తల్లిని అయ్యే అదృష్టాన్ని ప్రసాదించింది కూడా ఆయనే అని శివజ్యోతి పేర్కొంది.
అయినప్పటికీ ఆమె చేసిన తప్పుకి టీటీడీ బోర్డు కూడా కఠినంగా వ్యవహరించింది. శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేస్తూ.. ఇకపై ఆమెకి తిరుమలలో ప్రవేశం లేకుండా బోర్డు నిర్ణయం తీసుకుంది. శివజ్యోతిని బ్యాన్ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతికి తగిన శాస్తి జరిగింది అని అంటున్నారు. జీవిత కాలం శివజ్యోతికి తిరుమలలో ప్రవేశం లేకుండా చేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
55
అభిమానుల సలహా ఇదే
శివజ్యోతి ప్రస్తుతం గర్భవతి. దీనితో ఆమె అభిమానులు శివజ్యోతికి సలహా ఇస్తున్నారు. ఇలాంటి టైంలో ఒత్తిడి తీసుకోవద్దని, మీడియాకి దూరంగా ఉండాలని చెబుతున్నారు.శివజ్యోతి అలా మాట్లాడడం తప్పే.. కానీ ఆమె గర్భంతో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మరికొందరు కోరుకుంటున్నారు. టీటీడీ బోర్డు తన ఆధార్ కార్డు బ్లాక్ చేయడంపై శివజ్యోతి ఇంకా స్పందించలేదు.