Bigg Boss Telugu 9 ఓటింగ్ లో భారీ ట్విస్ట్ లు, ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరో తెలుసా?

Published : Oct 01, 2025, 10:52 PM IST

రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో, నాలుగో వారంలో కూడా నామినేషన్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఓటింగ్ లో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరో తెలుసా?

PREV
15
ఈసారి ఎవరు?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ప్రారంభం నుంచి ఊహించని ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్ ఎలిమినేషన్స్, కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో ఓనర్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్‌ను అమలు చేస్తూ, గేమ్‌కు కొత్త డైనమిక్ తీసుకొచ్చారు.ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న షో, ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ దశకు చేరుకుంది. మొదటి వారం శ్రేష్ఠి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి హౌస్‌ను విడిచిపెట్టారు. ఇప్పుడు నాలుగో వారంలో నామినేషన్స్ మరింత ఉత్కంఠను రేకెత్తించాయి.

25
నామినేషన్ లో హై వోల్టేజ్ డ్రామా

నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. గత వారం బిగ్‌బాస్, కన్ఫెషన్ రూమ్లో ప్రతి కంటెస్టెంట్‌ను పిలిచి, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని వారిని గుర్తించి వారి పేర్లను ఓ బాక్స్‌లో వేయమని సూచించారు. అదనంగా, స్పెషల్ గేమ్‌లో విజేతలకు నామినేట్ చేయే అదనపు పవర్ కూడా ఇచ్చారు. ఆ వారంలో తనూజ గౌడ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీతో ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డారు. కెప్టెన్‌గా ఉన్న డీమాన్ పవన్ కూడా నామినేషన్స్‌ నుంచి తప్పించుకున్నాడు. ఈసారి అంతకు మించి డ్రామా చోటు చేసుకుంది.

35
నామినేట్ అయిన కంటెస్టెంట్లు:

ఈసారి నామినేషన్లు నాలుగో వారం చాలా డిఫరెంట్ గా కొనసాగాయి. నామినేషన్లను కూడా ఒక గేమ్ లాగా సెట్ చేశాడు బిగ్ బాస్. ఈక్రమంలో జరగాల్సిన గొడవలు జరిగిపోయాయి. ఫైనల్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజన గల్రానీ, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్య, శ్రీజ లు నిలిచారు. వీరిలో ఒకరు హౌస్‌ను వీడాల్సి ఉంటుంది.

45
ఓటింగ్ ట్రెండ్‌ ప్రకారం

సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ఈవారం సంజన గల్రానీ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె 24.11% ఓట్లతో టాప్‌లో నిలిచింది. ఫ్లోరా షైనీ 18.09%, దివ్య 17.75% ఓట్లు సాధించగా, రీతూ చౌదరి మాత్రం కేవలం 14% ఓట్లతో వెనుకబడింది. అయితే డేంజర్ జోన్‌లో ఉన్న ఇద్దరు కామనర్ కంటెస్టెంట్లు - మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ. హరీష్ 11.05% ఓట్లు సాధించగా, శ్రీజ అత్యల్ప ఓట్లు పొందింది. దాంతో ఈసారి శ్రీజ డేంజర్ జోన్ లో పడ్డట్టు తెలుస్తోంది.

55
ఎలిమినేషన్ ఎవరు?

ఓటింగ్ సరళి ప్రకారం, హరీష్, శ్రీజలలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. శ్రీజ, గత నామినేషన్లలో కూడా తక్కువ ఓట్లు పొందినందున, ఈసారి పక్కాగా ఆమెపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆమెతో పాటు మాస్క్ మ్యాన్ హరీష్ కూడా హౌస్‌లో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాడు. అతని బిహేవియర్‌ను చూసిన ప్రేక్షకులు, ఎప్పుడు హౌస్ నుంచి వెళ్లిపోతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ఎటుపోతుందన్నది ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories