బిగ్ బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కంటెస్టెంట్లు టాప్ 5లో ఉంటారని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఫైనల్‌కి ఇంకా వారమే ఉంది. 14వ వారం రెగ్యూలర్‌గానే ఉంటుంది. ఆ తర్వాతి వారం ఫైనల్‌కి చేరుకుంటుంది. దీంతో బిగ్ బాస్ షోపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడంతా టాప్ 5 కంటెస్టెంట్లకి సంబంధించిన చర్చనే జరుగుతోంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనల్‌కి వెళ్లారు. టికెట్ టూ ఫినాలే గేమ్‌లో ఆయన విన్నర్‌గా నిలిచి డైరెక్ట్ గా ఫైనల్‌కి చేరుకున్నారు. ఈ వారం ఆయన నామినేషన్‌లో ఉండబోరని చెప్పొచ్చు. కళ్యాణ్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉంటారు.
25
తనూజ బెర్త్ కన్ఫమ్
ఇదిలా ఉంటే ఇక ఈ సీజన్ టాప్ 5కి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కళ్యాణ్ ఫైనల్‌కి చేరిన నేపథ్యంలో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు ఎవరనేది మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. కళ్యాణ్ తర్వాత టాప్ 5లో ఉండేవారిలో తనూజకి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమెకి పడుతున్న ఓటింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. కళ్యాణ్, తనూజ ఓటింగ్‌లో పోటీ పడుతూ వస్తున్నారు. తనూజకి టాప్ 5 స్థానం కన్ఫమ్ అని చెప్పొచ్చు.
35
టాప్ 5లోకి ఇమ్మాన్యుయెల్
ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ టాప్‌కి చేరతారు. హౌజ్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే అని చెప్పొచ్చు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, టాస్క్ ల్లోనూ బెస్ట్ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిగిలిన అందరు కంటెస్టెంట్లని డామినేట్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. ఆయన ముందు కళ్యాణ్, డీమాన్ పవన్, తనూజ కూడా నిలవలేకపోతున్నారు. దీంతో ఇమ్మాన్యుయెల్ టాప్ 5కి చేరతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, డౌట్ అస్సలే లేదు.
ఇక వీరి ముగ్గురి తర్వాత భరణికి ఛాన్స్ ఉందని సమాచారం. ఇటీవల నాగార్జున, నిహారికల వీడియో ఒకటి లీక్ అయ్యింది. అందులో నాగ్ చెప్పినదాన్ని బట్టి భరణిని టాప్ 5లో ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సుమన్ శెట్టికి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సంజనాకి కూడా అవకాశం ఉందని అంటున్నారు. ఈ వారం ఇద్దరి కంటెస్టెంట్లని ఎలిమినేట్ చేయబోతున్నారు. అది డీమాన్ పవన్ పక్కా, మరో కంటెస్టెంట్ల ఎవరనేది అసలు ప్రశ్న. సుమన్ శెట్టి, సంజనాల మధ్య ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. చాలా వరకు సంజనాని పంపించే అవకాశం ఉందట.
55
అంతిమంగా మిగిలేది వీరే
అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, భరణితోపాటు సుమన్ శెట్టి టాప్‌లో ఉంటారు. సుమన్‌ని పంపిస్తే, సంజనా టాప్ 5లో ఉంటారు. అంతిమంగా వీరే టాప్ 5 కంటెస్టెంట్లు అని చెప్పొచ్చు. అయితే లీస్ట్ కేసులో భరణిని ఈ వారం ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎలిమినేట్ అయి మళ్లీ వచ్చారు. కాబట్టి ఈ వారం పంపించినా ఆశ్చర్యం లేదు. కానీ నాగబాబు ప్రభావం ఉంటే మాత్రం ఆయన్ని టాప్ 5లో ఉంచుతారు. మరి ఏం జరుగుతుందో మున్ముందు తేలనుంది.