2025 సంవత్సరం కొన్ని సినిమాలు ఊహించని విధంగా హిట్ అవ్వగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మరికొన్నిసినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందులో టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా?
2025లో కొన్ని చిన్న సినిమాలు హిట్టవగా, భారీ బడ్జెట్ చిత్రాలు కొన్ని ఫ్లాపయ్యాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చాయి. ఆ టాప్ 5 ఫ్లాప్ సినిమాల లో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
26
థగ్ లైఫ్:
280 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో అంచనాలు పెరిగినా, కథనం బాగోలేక ఫ్లాప్ అయింది. 2025లో ఇదే అతిపెద్ద ఫ్లాప్.
36
పట్టుదల
138 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ. 136 కోట్లు వసూలు చేసింది. అజిత్ కుమార్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా.. ఈసినిమాకు కూడా స్క్రీన్ ప్లే బాగోలేక లాభాలు రాలేదు. అభిమానుల అంచనాలను పట్టుదల సినిమా అందుకోలేకపోయింది.
ధనుష్, శేఖర్ కమ్ములు కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాలో నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈసినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. 132 కోట్ల వరకే వసూలు చేసింది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైనా, కథనం ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది.
56
రెట్రో
150 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోపై అంచనాలున్నా, నెగటివ్ రివ్యూలతో ఫ్లాప్ అయింది. రొటీన్ కథతో నిరాశపరిచింది.
66
వీర ధీర శూరన్
55 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 66 కోట్లు వసూలు చేసి పర్వాలేదు అనిపించింది. విక్రమ్ యాక్షన్‌ను నమ్ముకున్నా, నిడివి ఎక్కువ, కథనం బలహీనంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాలేదు.