కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఈసారి బిగ్ బాస్ షోలో ఆరుగురు సామాన్యులకు అవకాశం ఇచ్చారు. మిగిలిన వారు సోషల్ మీడియా, సినిమా, టీవీ రంగాలలో పాపులర్ అయిన సెలెబ్రిటీలు. ఈసారి బిగ్ బాస్ షోలో గ్లామర్ అట్రాక్షన్ గా కొందరు సెలెబ్రిటీలు ఉన్నారు.