Priya Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండవ వారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీకెండ్ సమీపిస్తుండడంతో సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి ఉత్కంఠ భరితంగా మారుతోంది. డిమాన్ పవన్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యారు. నటి సంజన కూల్ గా తనపని తాను చేస్తోంది. ఇమ్మాన్యుయేల్ అందరితో బాగా ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నాడు. శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి నోటికి పని చెబుతున్నారు. సుమన్ శెట్టి ఇంకా హౌస్ లో తనదైన మార్క్ ప్రదర్శించలేదు. తొలివారం మహిళా కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
25
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?
రెండవ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఈవారం నామినేషన్స్ లో భరణి శంకర్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, డిమాన్ పవన్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతడు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక సుమన్ శెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. భరణి శంకర్, ఫ్లోరా షైనీలకు ఒక మోస్తరుగా ఓట్లు పడుతున్నాయి.
35
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి
ఇక మిగిలింది మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరీష్ ఈ ముగ్గురే. హరీష్ ఎలాగోలా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇక ప్రియా శెట్టి, మర్యాద మనీష్ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరికి అతి తక్కువ ఓట్లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రియా శెట్టి డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు.
కానీ ప్రియా శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం వాస్తవం. ప్రియా శెట్టిపై సోషల్ మీడియాలో కూడా విపరీతమైన నెగిటివిటి ఉంది. రాయలసీమకి చెందిన క్యూట్ డాక్టర్ పాప ఇంతలా టార్గెట్ కావడానికి కారణం ఏంటని ఆమె మద్దతు దారులు ఆశ్చర్యపోతున్నారు.
55
డాక్టర్ పాపని ఎందుకు టార్గెట్ చేశారు ?
ప్రియా శెట్టి ఇంతలా టార్గెట్ కావడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఆమె యాటిట్యూడ్ అందరికీ నచ్చడం లేదు. హౌస్ లో తనకు చిన్న విషయం కూడా అనుకూలంగా జరగకపోతే వెంటనే ప్రియా శెట్టి కోపంగా వివరణ అడుగుతుంది. ఎదుటివారితో వాగ్వాదానికి దిగుతుంది. ఈ కారణాల వల్ల ప్రియా శెట్టిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు శ్రీజ దమ్ముపై కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. మొత్తంగా ఈ వారం ప్రియా శెట్టి సేఫ్ అవుతుందా ఎలిమినేట్ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.