Bigg Boss Telugu 9 Nominations: హరీష్‌ సింపతీ గేమ్‌, కడిగిపడేసిన తనూజ.. మనీష్‌కి రీతూ కౌంటర్‌

Published : Sep 16, 2025, 12:14 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెండో వారం స్టార్ట్ అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌లో హరీష్‌ సింపతీ గేమ్‌ ఆడితే, రీతూ చౌదరీ.. మర్యాద మనీష్‌ కి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. నామినేషన్ల ప్రక్రియ చాలా వాడి వేడిగా జరిగింది. . 

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 9.. 8వ రోజు ఎపిసోడ్‌

బిగ్ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ మొదటి వారం విజయవంతంగా పూర్తయ్యింది. మొదటి వారం కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ ఎలిమినేట్‌ అయ్యారు. ఇక రెండో వారం ప్రారంభమైంది. సోమవారం(ఎనిమిదో రోజు) హౌజ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హరిత హరీష్‌ సింపతీ గేమ్‌ స్టార్ట్ చేశాడు. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. అదే సమయంలో హౌజ్‌లో ఫుడ్‌ కోసం లెంన్తీగా చర్చ జరిగింది. ఎవరు కుక్‌ చేయాలనేది, కెప్టెన్‌ కి అసిస్టెంట్‌ విషయాలపై చర్చ జరిగింది. అనంతరం నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి.

26
ఫుడ్‌ గురించి వాడీ వేడీగా చర్చ

మొదటి వారం ఎలిమినేషన్‌ అయిపోయాక ఇంట్లో ఫుడ్‌ మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఫ్రూట్స్ ని ఎలా ఇవ్వాలి, అదే సమయంలో హౌజ్‌లో దొంగతనం జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై చాలా సేపు చర్చ జరిగింది. అందులో భాగంగా ఫుడ్‌ ఎవరు వండాలనేది కూడా చర్చకు వచ్చింది. ఈ చర్చ నడుస్తున్న క్రమంలో హరిత హరీష్‌ సైలైంట్‌గా ఉన్నాడు. ఒక్కడే ఒంటరిగా ఉండిపోయాడు. ఏదో బాధలో ఉన్నాడు.

36
హరిత హరీష్‌ సింపతీ గేమ్‌

దీంతో బిగ్‌ బాస్‌ హరీష్‌ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిపించాడు. తన బాధ ఏంటో అడగ్గా, తన క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌ జరిగిందని, తాను ఇంటెన్షన్‌ తప్పు కాదని, కానీ చాలా రాంగ్‌గా పోట్రే చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెడ్‌ రోజెస్‌ విషయంలో తన ఉద్దేశ్యం రాంగ్‌ కాదని తెలిపారు. ఇలా తనని తప్పుగా చూపిస్తే అది తన ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం పడుతుందని, వాళ్లు ఎలా ఫీలవుతారు అనేది బిగ్‌ బాస్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్‌. దీనికి బిగ్‌ బాస్‌ స్పందిస్తూ, ఇలాంటి ఆటుపోట్లు వస్తుంటాయి, వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటేనే లైఫ్‌ సాఫీగా సాగుతుంది, ఆ ఎదుర్కోవడంలోనే మజా ఉంటుందని బిగ్‌ బాస్‌ హరీష్‌కి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో రాముకి హరీష్‌ని చూసుకునే బాధ్యత అప్పగించారు.

46
తనూజ తన నడుము గిల్లిందని ఇమ్మాన్యుయెల్‌ రచ్చ

మరోవైపు ఇమ్మాన్యుయెల్‌ తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌ ఇద్దరు ప్రైవేట్‌గా వేరే రూమ్‌లో కూర్చోని భోజనం చేస్తుండగా, అది చూసిన ఇమ్మాన్యుయెల్‌.. రీతూని మిస్‌ అవుతున్నా అని,తనని పట్టించుకోవడం లేదని, తమ మధ్యలోకి వచ్చావని పవన్‌పై కామెంట్‌ చేశాడు. నవ్వులు పూయించాడు. ఆ తర్వాత తనూజ తన నడుము గిల్లిందని కాసేపు కామెడీ చేశాడు ఇమ్మాన్యుయెల్‌. ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఇది ఎపిసోడ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.

56
హరీష్‌ని టార్గెట్‌ చేసిన తనూజ

అనంతరం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. కెప్టెన్‌గా ఉన్న సంజనా తప్ప మిగిలిన వారిని ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదట తనూజ.. హరీష్‌ని నామినేట్ చేసింది. గత వారం తన ప్రవర్తన గురించి రాంగ్గా మాట్లాడటం పట్ల ఆమె అభ్యంతం వ్యక్తం చేసింది. రాంగ్‌ బిహేవియర్‌ ని ఆమె ప్రశ్నించింది. ఫుడ్‌ విషయం కూడా ప్రస్తావనకి వచ్చింది. ఆ విషయంలో మరోసారి వాదనకి దిగారు. తనని ఎలా అవమానించాడు, తక్కువ చేసి మాట్లాడటం గురించి తనూజ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రెండో నామినేషన్‌గా ఫ్లోరా సైనీకి నామినేట్ చేసింది తనూజ. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుందని, షాంపూ బాటిల్ విషయంలో ఇంత సాడిజం ఏంటనే ప్రశ్నించింది. దీంతో ఇద్దరి వాదనలతో హౌజ్‌ హాట్‌ హాట్‌గా మారింది.

66
మర్యాద మనీష్‌కి రౌతీ చౌదరీ కౌంటర్‌

అనంతరం మర్యాద మనీష్‌ వచ్చి భరణిని నామినేట్‌ చేశారు. ఆయన గొడవలు పెడుతున్నాడని ఆరోపించారు. ఎగ్‌ గురించి చర్చ జరుగుతుంది. గొడవ జరుగుతుంటే, సైలెంట్‌గా ఉన్నాడని, ఆ తర్వాత ఆ గొడవని టీ వైపు టర్న్ తిప్పాడని ఆరోపించారు. డబుల్‌ గేమ్‌ ఆడుతున్నాడు అని తెలిపారు. ఆ తర్వాత రీతూ చౌదరీని నామినేట్‌ చేశాడు మనీష్‌. రూల్స్ బ్రేక్‌ చేస్తుందని, అంట్లు సరిగా క్లీన్‌ చేయడం లేదని, చాలా సార్లు చెప్పాల్సి వస్తుందని ఆరోపించాడు. దీనికి రీతూ కూడా కౌంటర్‌ ఇచ్చింది. తాను క్లీన్‌ చేస్తున్నట్టు డీమాన్‌ పవన్‌తోనే చెప్పించింది. అయితే ఇందులో హరీష్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శనివారం, ఆదివారం షోలో ఆయన పరువుపోయింది. రియాలిటీ బయటకు రావడంతో నాగార్జున అనే మాటలను తట్టుకోలేకపోయాడు. దీంతో సింపతి గేమ్‌ ఆడుతున్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories