బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య అవుట్, కానీ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసిన నాగార్జున.. ఏం జరిగిందో తెలుసా ?

Published : Nov 23, 2025, 11:27 PM IST

ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. కానీ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. నాగార్జున అలా ఎందుకు చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Bigg Boss Telugu 9

 కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9లో సండే ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. సండే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చివర్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. 

25
రీతూకి సపోర్ట్ గా అఖిల్ 

రీతూ చౌదరికి సపోర్ట్ గా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్, ఆమె బ్రదర్ వచ్చారు. రీతూ చౌదరి నెగిటివిటీ తో హౌస్ లోకి వచ్చింది. కానీ ఆ నెగిటివిటి అంతా ఇప్పుడు పాజిటివ్ గా మారింది అని అఖిల్ ప్రశంసించాడు. హౌస్ లో టాప్ 5 గా నిలిచే సభ్యులని అఖిల్ తన అంచనాతో చెప్పాడు. రీతూ, తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ టాప్ 5 లో ఉంటారని అఖిల్ తెలిపాడు. 

35
బుల్లితెర నటి హరిత ఎంట్రీ 

ఆ తర్వాత పవన్ తండ్రి, అతడి స్నేహితుడు బిగ్ బాస్ డయాస్ పైకి వచ్చారు. పవన్ తన తండ్రి, స్నేహితుడితో ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత తనూజకి సపోర్ట్ గా బుల్లితెర నటి హరిత వచ్చారు. వీరిద్దరూ ముద్దమందారం టీవీ సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. హరితని చూడగానే తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వీరందరూ వెళ్లిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. 

45
ఇమ్మాన్యుయేల్ కి పవర్ అస్త్ర ఉపయోగించే ఛాన్స్ 

చివరికి నామినేషన్స్ లో కళ్యాణ్, సంజన, భరణి, దివ్య మిగిలారు. వీరిలో కళ్యాణ్, భరణి సేవ్ అయ్యారు. ఇక చివరికి మిగిలింది దివ్య, సంజన. వీరిని నాగార్జున గార్డెన్ ఏరియాలోకి పంపారు. లివింగ్ రూమ్ లో నాగార్జున ఇమ్మాన్యుయేల్ తో పవర్ అస్త్ర గురించి అడిగారు. పవర్ అస్త్ర ఉపయోగిస్తే ఇప్పుడే ఉపయోగించాలి. ఆ తర్వాత దానికి పవర్ ఉండదు. నువ్వు పవర్ అస్త్ర ని ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్ లేకుండా క్యాన్సిల్ చేయొచ్చు అని నాగార్జున తెలిపారు. 

55
దివ్య ఎలిమినేటెడ్, కానీ సేవ్ అయింది 

నేను ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తే ఈవారం ఎవ్వరూ ఎలిమినేట్ కారా అని ఇమ్మాన్యుయేల్ నాగార్జునని అడిగి క్లారిఫై చేసుకున్నారు. నాగార్జున క్లారిటీ ఇచ్చిన తర్వాత తాను పవర్ అస్త్ర ఉపయోగిస్తున్నానని ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇమ్మాన్యుయేల్ తన నిర్ణయం చెప్పడంతో నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించారు. దీనితో సంజన, దివ్య ఇద్దరూ సేవ్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది నాగార్జున చెక్ చేశారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయింది. కానీ ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర ఉపయోగించడంతో ఆమె బతికిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories