విడుదల చేసిన పబ్లిక్ స్టేట్‌మెంట్‌లో, ఈ ఆరోపణలపై AICWA ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వివాదాలను నిష్పక్షపాతంగా విచారించి, పరిష్కారం చూపేందుకు ఒక పటిష్టమైన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. కళాకారుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యం అని, ఇలాంటి సమస్యలను అంతర్గతంగా అణచివేయకుండా, బహిరంగ విచారణ జరపాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.
‘గోట్’ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి దివ్యభారతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ఆమెపై అందరి దృష్టి పడేలా చేశాయి. ఆమె మాటలు పని ప్రదేశంలో నైతికత, సెట్‌లో ప్రవర్తన, నటీనటులకు సురక్షితమైన పని వాతావరణం లాంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టినందుకు AICWA ఆమెను ప్రశంసించింది. కళాకారులందరూ ఎలాంటి ప్రతీకార చర్యలకు భయపడకుండా ఫిర్యాదులు చేసే అవకాశం ఉండాలని పేర్కొంది. సరైన ఫిర్యాదుల స్వీకరణ పద్ధతులను పాటించాలని ప్రొడక్షన్ హౌస్‌లు, గిల్డ్‌లను అసోసియేషన్ కోరింది.