Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా ప్రకటించే ఇండియా మోస్ట్ పాపులర్ ఫిల్మ్ స్టార్స్ జాబితాలో ఈ సారి అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు గట్టి దెబ్బ పడింది. తమిళ హీరోలు దెబ్బకొట్టారు.
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఫిల్మ్ స్టార్స్ కి సంబంధించిన ప్రతి నెల రిపోర్ట్ వస్తుంది. ఇందులో తెలుగు హీరోలతోపాటు, బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు ప్రధానంగా ఉంటారు. అయితే ఇందులో ఎక్కువ భాగం మన తెలుగు స్టార్సే ఉండటం విశేషం. తాజాగా ఆగస్ట్ నెలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇందులో చాలా మంది స్టార్స్ స్థానాలు మారిపోయాయి. తెలుగు హీరో టాప్ 10 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో హీరో స్థానం తగ్గిపోయింది. అయితే ఇందులో తమిళ హీరోలు సత్తా చాటడం విశేషం.
28
నెంబర్ 1 ప్రభాస్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ ఇండియా లిస్ట్ లో ఎప్పటిలాగే నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచారు. గత కొంత కాలంగా ప్రభాసే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటున్నారు. ఆయన్ని టచ్ చేసే వారు లేరనే చెప్పాలి. ఆయన ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్ పరంగా ఆయన్ని టచ్ చేసేవారు లేరు, పాపులారిటీ విషయంలోనూ ఆయన్ని టచ్ చేసేవారు లేరని చెప్పొచ్చు.
38
రెండు మూడు స్థానాల్లో విజయ్, అజిత్
ఇక రెండో స్థానం కూడా కోలీవుడ్ స్టార్ విజయ్‌కి ఫిక్స్ అయిపోయింది. ఒకటి రెండు సార్లు మాత్రమే మార్పు కనిపించింది. దాదాపు అన్ని నెలలు ఆయన రెండో స్థానంలో ఉంటున్నారు. అయితే ఎప్పుడు ఐదవ స్థానంలో ఉండే అజిత్ ఇప్పుడు మూడో స్థానానికి రావడం విశేషం. ఒకేసారి ఆయన రెండు స్థానాలు పెరిగి మూడో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నాల్గో స్థానానికి పడిపోయారు. ఆయన గతంలో మూడో స్థానంలో ఉండేవారు.
తెలుగు స్టార్స్ కి సంబంధించి ఎన్టీఆర్ స్థానం మెరుగుపడింది. ఆయన చాలా వరకు చివరి రెండు రెండు మూడు స్థానాల్లో ఉండేవారు. కానీ ఆగస్ట్ నెలలో ఏకంగా ఐదో స్థానానికి మెరుగయ్యారు. అయితే గత నెలలో తారక్ `వార్ 2`లో నటించారు. దీంతో ఆ నెల మొత్తం ఎన్టీఆర్‌కి సంబంధించిన చర్చ జరిగింది. అలా తారక్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
58
పడిపోయిన అల్లు అర్జున్ స్థానం
ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండే బన్నీ ఆగస్ట్ లో చాలా డౌన్ అయ్యారు. ఆయన ఏకంగా ఆరో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తర్వాత స్థానానికి పరిమితమయ్యారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ తరచూ జరుగుతూనే ఉంది. కానీ ఈ మూవీకి క్రేజ్, హైప్ మాత్రం రావడం లేదు. ఇదే బన్నీ స్థానం పడిపోవడానికి కారణంగా చెప్పొచ్చు.
68
మహేష్ బాబు స్థానం పదిలం
ఏడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఆయన ఆరు, ఏడు స్థానాల్లో ఉంటున్నారు. ఒక స్థానం అటుఇటుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఏడో స్థానంలో నిలిచారు. రాజమౌళితో ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు మహేష్.
78
టాప్ 10లోకి దూసుకొచ్చిన సూపర్ స్టార్ రజనీ
ఇంకోవైపు ఎనిమిదో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. ఆయన ఎప్పుడూ ఈ టాప్ 10లోకి రాలేదు. అయితే గత నెలలో ఆయన హీరోగా నటించిన `కూలీ` మూవీ విడుదలైంది. ఇది బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. దీంతో రజనీకాంత్‌కి సంబంధించి దేశ వ్యాప్తంగాచర్చ జరిగింది. అది ఆయన ఇమేజ్‌ని, క్రేజ్‌ని, పాపులారిటీని పెంచిందని చెప్పొచ్చు. అందుకే టాప్ 8లో నిలిచారు. టాప్ 9, 10 స్థానాలను సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు దక్కించుకున్నారు.
88
టాప్ 10లో స్థానం కోల్పోయిన రామ్ చరణ్
గతంలో చాలా వరకు ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉండే రామ్ చరణ్, ఈ సారి మాత్రం అసలు టాప్ 10లోనే లేరు. ఇది ఆయనకు అవమానమనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్లు లేవు. పైగా రజనీకాంత్, అక్షయ్, సల్మాన్‌లకు సంబంధించిన సినిమాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వారు ట్రెండింగ్‌లోకి వచ్చారు. రామ్ చరణ్ టాప్ 10 లో స్థానాన్ని కోల్పోయారు.