Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు. హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారు? సీక్రెట్ రూమ్ కథేంటీ? అందులోకి ఏ కంటెస్టెంట్ వెళ్లబోతున్నారు? అనే సస్పెన్స్ గా మారింది.
Bigg Boss Telugu 9: బిగ్ బిగ్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ట్విస్టులు, టాస్కులు, కాంట్రవర్సీలతో ఈ గేమ్ షో ఆసక్తికరంగా మారిపోయింది. అన్నింటి కన్న శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హోస్టింగ్ పుల్ మాస్. ఎక్స్ ట్రా చేసే కంటెస్టెంట్స్ లకు ఇచ్చేపడేశారు. వారి తప్పులను ఎత్తిచూపుతు దుమ్ముదులిపేశారు. అలాగే.. ఓనర్స్ ను టెనెంట్స్ గా, టెనెంట్స్ ను ఓనర్స్ గా మార్చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇలా ఎన్నో ఊహించని ట్విస్టులతో ఎంతో ఎగ్జైటింగ్ సాగుతోంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా మారింది. ఓటింగ్ లైన్స్ చూస్తే.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. అలాగే.. మరో కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
25
ఎలిమినేషన్ టెన్షన్..
నిన్న శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిన తర్వాత, అభిమానులు నెట్‌లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలను చర్చించసాగారు. ఈ వారంలో నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డీమాన్ పవన్, హరిత హరీష్. వీరిలో డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యారు కాబట్టి సేఫ్, సుమన్ శెట్టికి ఎవరు ఊహించని ఓటింగ్ ఉంది. కాబట్టి అంత సేఫ్.. పైగా కింగ్ నాగ్ కూడా సుమన్ శెట్టి ఆటను మెచ్చుకున్నారు. పొగత్తలతో ముంచెత్తారు. ఇక హరిత హరీష్.. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ మొత్తం ఆయననే టార్గెట్ చేశారు. చాలా మంది కూడా హరిత హరీష్ ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ, ఆయనకు భారీ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా.. కింగ్ నాగ్ కూడా హరిత హరీష్ కు స్పెషల్ అండ్ సర్ఫ్రైజ్ కూడా ఇచ్చారు. ఆటను మరింత ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.
35
డేంజర్ జోన్ అంచనాలు
ప్రస్తుతం ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, కామనర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి, మనీష్ మర్యాద, ఫ్లోరా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం తక్కువ ఓటింగ్ తో తప్పించుకున్న ఫ్లోరా, ఈ వారం కూడా తక్కువ ఓట్లు పొందింది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, ఊహించినట్లుగా ఫ్లోరా ఎలిమినేట్ కాకుండా, ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే.. నామినేషన్ ప్రక్రియలో మనీష్ డబుల్ స్టాండ్స్, ప్రతి చిన్న విషయంపై ఓవర్ థింకింగ్, ఆటలో అతి స్ట్రాటజీ వాడడం వల్ల ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడింది. ప్రియా విషయానికి వస్తే, ఫస్ట్ వీక్ నుంచి ఆమె గట్టిగా అరవడం, ‘రంగు పడుద్ది’ టాస్క్‌లో భరణి అవుట్ అవ్వడం తదితర బిహేవియర్ కారణంగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది.
బిగ్ బాస్ సీజన్ 9 లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం చాలా టాఫ్ గా మారింది. డేంజర్ జోన్ లో ప్రియా తొలుత షాక్ ఇచ్చిన తరువాత బిగ్ బాస్ సేవ్ చేశారట. సోషల్ మీడియా క్యాంపెయిన్లు, సింపతీ వేవ్ బట్టి చూస్తే.. ప్రియా టాప్ 2 లోకి ఉన్నారట. ఈ క్రమంలో మర్యాద మనీష్ హౌజ్ నుండి బయటకు రాబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయనకు పెద్ద ఫాలోయింగ్ లేకపోవడంతో, ఆటలో ఆకట్టకపోవడం కారణంగా ఓటింగ్ లో వెనకబడినట్టు తెలుస్తోంది. ఫైనల్ ప్రియా సేఫ్ అయి, మర్యాద మనీష్ ఎగ్జిట్ అయినట్టు తెలుస్తోంది.
55
బిగ్ బాస్ లాకప్ లో ఫ్లోరా సైనీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఫ్లోరా సైనీ కి “మోస్ట్ బోరింగ్” అనే లేబుల్‌తో షాక్ ఇచ్చారు కింగ్ నాగ్. హౌస్ లో మోస్ట్ బోరింగ్ ఎవరు? అని హోస్ట్ కింగ్ నాగ్ ప్రశ్నించగా, హరీష్, శ్రీజ, సంజనా, డిమాన్ పవన్ కలిసి ఫ్లోరాను వెరీ బోరింగ్ అన్నారు. సుమన్ కూడా ఆమెను బోరింగ్ అని పేర్కొన్నారు. తనూజ్ మాత్రం హరిత్ బోరింగ్ అని చెప్పాడు. ఈ సమయంలో నాగ్ ప్రతిస్పందిస్తూ ఆమెతో మాట్లాడొచ్చుగా ప్రశ్నిస్తారు. “ఆమెకు హిందీ వస్తుంది, నాకు హిందీ రాదు సార్” అని సుమన్ అంటారు. నాగ్ మాత్రం, “నువ్వు బోజ్‌పురిలో మాట్లాడొచ్చు కదా?” అని అడిగినపుడు, వెంటనే సుమన్ రియాక్ట్ అవుతూ.. “నేను రెండు సినిమాలే చేశాను సార్” అని సమాధానం ఇచ్చింది. ఈ షాక్ రియాక్షన్ హౌస్‌లో మరో రియాలిటీ డ్రామా మోమెంట్‌గా నిలిచింది. ఈ టాస్క్ చాలా ఫన్నిగా జరిగినా ఫోరా షైనీ ని మోస్ట్ బోరింగ్ అంటూ లాకప్ లో వేశారు.