ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పోలింగ్ ప్రకారం టాప్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో తనూజ ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ ఉన్నాడు. నాల్గో స్థానంలో సంజనా గల్రానీ ఉన్నారు. ఐదో స్థానంలో భరణి ఉన్నారు. మొదటి రెండు రోజుల్లో డౌన్‌లో ఉన్న భరణి కాస్త పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో డీమాన్ పవన్, ఏడో స్థానంలో సుమన్ శెట్టి, ఎనిమిదో స్థానంలో దివ్య ఉన్నారు. ఓ రకంగా దివ్యతోపాటు సుమన్ శెట్టి, డీమాన్ పవన్ కూడా డేంజర్‌లోనే ఉన్నట్టుగా చెప్పొచ్చు. గురువారం, శుక్రవారం ఓటింగ్‌లో ఏదైనా మార్పు వస్తే ఎలిమినేషన్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, భరణి, సంజనా, ఇమ్మాన్యుయెల్, దివ్య, సుమన్ శెట్టి ఉన్నారు.