ఓటీటీ లో ఉత్కంఠ రేపే టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు, ఎక్కడ చూడొచ్చంటే?

Published : Nov 27, 2025, 02:59 PM IST

Top 5 Indian Thriller Series : వీకెండ్‌లో బయటకు వెళ్లకుండా..  ఇంట్లోనే ఉండి ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటున్నారా?  అయితే ఓటీటీలో  కొన్నిఉత్కంఠ రేపే థ్రిల్లర్ సినిమాలున్నాయి. అవి  ఎక్కడ చూడొచ్చంటే? 

PREV
16
5 క్రైమ్ థ్రిల్లర్‌లు

ఓటీటీ లో టాప్ 5  థ్రిల్లర్ సినిమాలు మొదటి  నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో పాటు టెన్షన్ కలిగిస్తాయి. పదేపదే వచ్చే ట్విస్టులు, అద్భుతమైన కథనంతో మంచి వినోదాన్ని కూడా అందిస్తాయి.

26
ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 - నెట్‌ఫ్లిక్స్

ఢిల్లీ క్రైమ్ సీజన్ 2..  సీజన్ 1 కన్నా వేగంగా సాగే ఈ సిరీస్ లో ఢిల్లీ పోలీసులు కచ్చా బనియన్ గ్యాంగ్‌తో పోరాడతారు. వాస్తవ కథ, బలమైన తారాగణం, టైట్ స్క్రీన్ ప్లే తో ఈ సిరీస్  సస్పెన్స్ రేపుతుంది. సీజన్ 3 కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

36
ది నైట్ మేనేజర్ ఇండియా – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఇది బ్రిటిష్ సిరీస్ రీమేక్. విలాసవంతమైన హోటళ్లు, అండర్‌కవర్ మిషన్లు, ప్రాణాంతక ఆయుధాల వ్యాపారి కథ ఇది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ నటన, స్టైలిష్ యాక్షన్, ట్విస్టులు అద్భుతంగా ఉంటాయి.

46
అరణ్యక్ – నెట్‌ఫ్లిక్స్

హిమాలయాల్లోని సిరోనా పట్టణంలో ఈ థ్రిల్లర్ సాగుతుంది. ఓ రహస్య హత్యను దర్యాప్తు చేసే పోలీసుల కథ ఇది. భయంకరమైన అడవులు, స్థానిక కథలు, పాత్రల రహస్యాలు చివరిదాకా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సీన్ సీన్ కు ట్విస్ట్ అదిరిపోతుందీ సిరీస్ లో.

56
క్రిమినల్ జస్టిస్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఈ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌లో ప్రఖ్యాత బ్రిటిష్ షో అంశాలున్నాయి. క్రైమ్, సీక్రేట్ లాంటి విషయాల కలబోత  ఈసినిమా . ఇందులో ఎంతో మానసిక సంఘర్షణ కనిపిస్తుంది.  తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి పోరాడే ఓ యువకుడి కథ ఇది. 

66
దహాద్ – అమెజాన్ ప్రైమ్ వీడియో

సోనాక్షి సిన్హా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, అందరి కళ్ల ముందే తిరిగే ఓ సీరియల్ కిల్లర్‌ను వేటాడే కథ. రాజస్థాన్ గ్రామీణ నేపథ్యం లో ఈ  సినిమా ఉంటుంది. చాలా స్లోగా సాగుతూ.. ఉత్కంఠ పెంచుతూ ఉంటుందీ సినిమా. కొన్ని షాకింగ్ ట్విస్ట్ లు కూడా ఆడియన్స్ ను ఆశ్చర్చపరుస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories