నటి రోజా సెల్వమణి హీరో సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య తనకి ఇన్సిపిరేషన్ అని ఆమె అన్నారు. సూర్య చేసిన ఒక గొప్ప పని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు రోజా తెలిపారు.
నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. పొలిటికల్ గా బోల్డ్ గా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా రోజా గుర్తింపు పొందారు. కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యల వల్ల ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. తెలుగులో రోజా రాజకీయాల కారణంగా 2013 లోనే సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. కానీ టీవీ షోలలో మాత్రం కొనసాగుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత రోజా తమిళంలో లెనిన్ పాండియన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
25
సూర్య అగరం ఫౌండేషన్
ఓ ఇంటర్వ్యూలో రోజా.. తమిళ స్టార్ హీరో సూర్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకి తమిళంలో సూర్య ఇన్సిపిరేషన్ అని రోజా ఓపెన్ గా చెప్పారు. సూర్య అగరం ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులని చదివించడం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చదువు కోసం స్కాలర్ షిప్ లు ఇవ్వడం ఇలా అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు సూర్య చేస్తున్నారు.
35
51 మంది విద్యార్థులని డాక్టర్లని చేసిన సూర్య
సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా సహాయం పొంది ఏకంగా 51 మంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు. ఆ మధ్యన మే డే సందర్భంగా అగరం ఫౌండేషన్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ సంస్థ 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అగరం ఫౌండేషన్ ద్వారా డాక్టర్లు అయిన 51 మంది డయాస్ పై నిలబడ్డారు. వారిని చూడగానే సూర్య ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు అగరం ఫౌండేషన్ ద్వారా 1800 మంది ఇంజనీర్లు కూడా అయ్యారట.
దీని గురించి రోజా మాట్లాడుతూ.. ''ఆ ఈవెంట్ లో సూర్య చదివించిన డాక్టర్లు డయాస్ పైకి వచ్చారు. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. ఇంత మంది డాక్టర్లని సూర్య చదివించారా అని తెలియడంతో నా మైండ్ పోయింది. ఆ విషయంలో సూర్య నాకు ఆదర్శం. వారి ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి.. ఆయన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను నా స్థాయిలో కష్టపడుతూ ఇంటిని చూసుకుంటూ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నా. ఆ విధంగా నాకు కూడా ఒక సంతృప్తి ఉంది'' అని రోజా తెలిపారు.
55
సినిమాల్లోకి రీ ఎంట్రీ
తమిళంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. తెలుగు కూడా నటన ప్రారంభిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో రోజా ఒకప్పుడు అగ్ర నటిగా వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో సినిమాలు చేశారు.