బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే . వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన దివ్య బిగ్ బాస్ ద్వారా అందుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 9 వారాలు హౌస్ లో ఉన్న దివ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి ఫేజ్ లోకి అడుగుపెట్టింది. ఇక మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, సంజన, సుమన్ శెట్టి, భరణి, పవన్ ఉన్నారు. దివ్య నిఖిత సండే రోజు ఎలిమినేట్ అయింది. మిగిలిన వారిలో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ లు టాప్ 5 చేరుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
25
ఎలిమినేట్ అయిన దివ్య
దివ్య ఎలిమినేట్ కావటానికి తనే కారణాలు చెప్పేసింది. హౌస్ లో బాండింగ్స్ వల్ల గేమ్ పై ఫోకస్ చేయలేకపోయానని పేర్కొంది. దివ్య హౌస్ లోకి మూడు వారాల తర్వాత వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో ఆమె పాల్గొన్నారు. ఆమె చలాకీతనం, మాట్లాడే విధానం చూసి అగ్ని పరీక్ష నుంచి డైరెక్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్తారని అంతా భావించారు. కానీ డైరెక్ట్ కంటెస్టెంట్ గా దివ్యకి ఛాన్స్ రాలేదు. చివరికి వైల్డ్ కార్డు ద్వారా ఆమెని అదృష్టం వరించింది. మొత్తానికి హౌస్ లోకి వెళ్లిన దివ్య తనదైన శైలిలో రచ్చ మొదలు పెట్టింది.
35
హౌస్ లో ఆమె చేసిన తప్పు అదే
అప్పటికే భరణిని ఫాదర్ లాగా భావించి తనూజ ఎమోషనల్ బాండింగ్ కొనసాగిస్తోంది. వీరిద్దరి మధ్యలో దివ్య దూరడం కొంత మందికి నచ్చలేదు. దివ్య కూడా భరణితో ఎమోషనల్ బాడింగ్ పెట్టుకుంది. అతడిని అన్నయ్య అని భావించింది. తనూజ గేమ్ ని బ్యాలెన్స్ చేస్తూ భరణితో బాడింగ్ కొనసాగించింది. కానీ దివ్య అలా చేయలేకపోయింది. అవకాశం వచ్చినప్పుడు మాత్రం తన వాయిస్ ని బలంగా వినిపించింది. ఈ క్రమంలో తనూజ, దివ్య శత్రువులుగా మారిపోయారు. అలా దివ్య వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి 65 రోజులు హౌస్ లో గడిపింది.
మెడిసిన్ చదువుతున్న దివ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందింది. సినిమా రివ్యూలు చెప్పడంతో ఆమెకి గుర్తింపు దక్కింది. బిగ్ బాస్ షోతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. 9 వారాలకి గాను దివ్య సెలెబ్రిటీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంది. ఒక్కో వారానికి ఆమెకి 1.7 లక్షలు చెల్లించారు. అంటే 9 వారాలకు దివ్య బిగ్ బాస్ నుంచి రూ.15 లక్షలు రెమ్యునరేషన్ పొందింది.
55
అతి తక్కువ ఓట్లు వారిద్దరికే
వాస్తవానికి దివ్య గత వారమే ఎలిమినేట్ కావలసింది. కానీ ఇమ్మాన్యుయేల్ ఆమెని పవర్ అస్త్రతో కాపాడాడు. ఆ వారం ఎలిమినేషన్ ని ఇమ్ము తన పవర్ అస్త్రతో రద్దు చేశారు. దీనితో దివ్య మరో వారం హౌస్ లో కొనసాగింది. ఓటింగ్ లో దివ్య, సుమన్ శెట్టికి అతి తక్కువ ఓట్లు పడ్డాయి. దివ్య కంటే సుమన్ శెట్టి పాపులర్, పైగా అతడికి బిగినింగ్ నుంచి సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. దీనితో దివ్య ఎలిమినేట్ కాక తప్పలేదు.