సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు మొదలయ్యాయి. కోయంబత్తూర్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
స్టార్ హీరోయిన్ సమంత 2021లో నాగ చైతన్య నుంచి విడిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై ఊహాగానాలే తప్ప, అసలైన కారణం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో సమంత కొంత కాలం సతమతమయింది. మయో సైటిస్ నుంచి కోలుకుని తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది.
25
రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్
ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడ్డారు. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. రాజ్ తో ఉన్న ఫోటోలని సమంత కూడా షేర్ చేసింది. దీనితో సమంత.. రాజ్ తో తన రిలేషన్ ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారా అనే వార్తలు మొదలయ్యాయి.
35
ఇవాళే సమంత, రాజ్ పెళ్లి ?
తాజాగా సమంత, రాజ్ నిడిమోరు పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా వార్తలు మొదలయ్యాయి. నేడు సోమవారం డిసెంబర్ 1న రాజ్, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సమంత కానీ, రాజ్ కానీ స్పందించలేదు.
కానీ ఈ జంట సోమవారం రోజు కోయంబత్తూర్ లోని ఇషా యోగా సెంటర్ లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి. తరచుగా సమంత ఇషా యోగా సెంటర్ ని సందర్శిస్తుంటారు. ఇప్పుడు అనే ఆమె పెళ్ళికి వెన్యూగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజ్ నిడిమోరుకి కూడా గతంలో వివాహం జరిగింది. తన భార్య శ్యామాలి దే నుంచి రాజ్ విడిపోయారు.
55
రాజ్ మాజీ భార్య సెటైర్
సమంత, రాజ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య శ్యామాలి దే సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైరికల్ పోస్ట్ చేశారు. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు అంటూ ఆమె పోస్ట్ చేశారు. సమంత సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె పూర్తి స్థాయిలో నటించి రెండేళ్లు అవుతోంది. ఖుషి చిత్రంలో సమంత చివరగా మెరిసింది. కాగా ఈ ఏడాది ఆమె శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో చిన్న పాత్రలో మెరిశారు.