ఏడాదికి 22 సినిమాలు, 10 హిట్లు, రోజుకు 3 షిప్ట్ లలో.. రాత్రి 2 వరకూ పనిచేసిన తెలుగు స్టార్ హీరో ఎవరు?

Published : Dec 01, 2025, 10:05 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో.. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క మార్క్. తెలుగు సినిమాలో తమ ప్రత్యేకత చాటుకోవడం కోసం హీరోలు ఎంతో చేశారు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. వారిలో ఏడాదికి 22 సినిమాలు.. 10 సక్సెస్ లు చూసిన తెలుగు హీరో ఎవరో తెలుసా? 

PREV
15
ప్రస్తుతం పాన్ ఇండియా మోజు..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో ఈ తరం హీరోలు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడంలేదు. పెద్ద హీరోలందరు రెండు మూడేళ్లకు ఒక్క సారి మాత్రమే అభిమానులకు కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. కొంత మంది అయితే రెస్ట్ లేకుండా పనిచేసి.. ఒక ఇయర్ లో 20 కి పైగా సినిమాలు రిలీజ్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ రికార్డు ఒకే ఒక్క హీరో పేరు మీద ఉంది. ఆయన తరువాత టాలీవుడ్ లో అన్ని సినిమాలు చేసిన హీరో మరొకరు లేరు. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.

25
అత్యధిక సినిమాల రికార్డు

సూపర్ స్టార్ కృష్ణ సినిమాల రికార్డుల గురించి ఎంతో మంది.. ఎన్నో సందర్భాల్లో.. ఎంతో గొప్పగా చెప్పిన వారు ఉన్నారు. ఈక్రమంలోనే దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఒక సినిమా కార్యక్రమంలో కృష్ణ సినిమాల గురించి ఆయన గొప్పతనం గురించి వెల్లడించారు. దాసరి నారాయణ రావు మాట్లాడుతూ.." చాలా మంది హీరోలు చాలా సినిమాలు చేస్తారు. చాలా సక్సెస్ లు కూడా వస్తాయి. కానీ పరిశ్రమ కానీ.. భవిష్యత్తులో వచ్చే ఆర్టిస్టులు కానీ... తెలుసుకోవలసిన విషయం ఏంటంటే? ఇది అందరు తెలుసుకోవలసిన విషయం... కృష్ట రోజుకు మూడు సినిమాలకు పనిచేశారు. మూడు షిప్ట్ లలో పనిచేశారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకూ ఒక సినిమా.. మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మరోక సినిమా.. తరువాత రాత్రి 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ ఇంకో సినిమా. రోజుకు మూడు షిప్ట్ లు మూడు సినిమాలకు పనిచేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ'' అని దాసరి అన్నారు.

35
ఏడాదికి 22 సినిమాలు 10 హిట్లు..

కృష్ణ సినిమాల గురించి దాసరి మాట్లాడుతూ.. రోజుకు మూడు సినిమాల చొప్పున.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడెనిమిదేళ్లు ఇలానే కంటీన్యూగా చేశారు. ఇలా ఏడెనిమిది సవంత్సరాలు అయ్యే సరికి.. దగ్గర దగ్గరగా 80 సినిమాల వరకూ అయ్యేవి. ఇంత తక్కువ టైమ్ లో అన్ని సినిమాలు ఏ హీరోకి కూడా సాధ్యం కాదు. ఏడాదికి 22 సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక తెలుగు హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఒక్క సంవత్సరంలో 10 హిట్ సినిమాలు ఇచ్చిన ఏకైక హీరో కూడా కృష్ణనే'' అని దాసరి నారాయణ రావు అన్నారు.

45
టాలీవుడ్ కు టెక్నాలజీని పరిచయం చేసిన హీరో

కృష్ణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్ స్టార్ గా మారడానికి ఎంతో కష్టపడ్డారు. తెలుగు సినిమాకు కృష్ణ టెక్నాలజీ తో సొగబులద్దారు. టాలీవుడ్ లో ఫస్ట్ కలర్ సినిమా కృష్ణదే. ఫస్ట్ జేమ్స్‌బాండ్‌ మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన తొలి హీరో కూడా కృష్ణనే. తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రం, ఫస్ట్ కలర్ సినిమా కూడా కృష్ణ చేసిందే. సింహాసనం సినిమాతో టాలీవుడ్ లో తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌ ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా కృష్ణ టాలీవుడ్ కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. కలర్ ప్రింట్స్ కోసం ముందుగానే ఫారెన్ కంపెనీలకు లక్షల్లో అడ్వాన్స్ లు కట్టి.. తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాల ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు కృష్ణ.

55
నిర్మాతల పాలిట దేవుడు

సూపర్ స్టార్ కృష్ణను ఇండస్ట్రీలో దేవుడిలా కొలుస్తారు. మరీ ముఖ్యంగా నిర్మాతల పాలిట ఆయన నిజంగా దేవుడే. రెమ్యునరేషన్స్ ఇచ్చినా ఇవ్వకుండా అడిగేవారు కాదట, తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే.. ఆనిర్మాతతో మరో సినిమా చేయడానికి వెంటనే కాల్షీట్లు ఇచ్చి, ఫైనాన్స్ కూడా ఇప్పించేవారట. ఇలా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే వ్యక్తి కృష్ణ. అందుకే నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా.. చూసీ చూడనట్టు ఉండేవారట కృష్ణ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఎలా అయితే తమ ప్రత్యకతను చాటుకున్నారో, కృష్ణ కూడా తన మార్క్ సినిమాలతో ఇండస్ట్రీలో చిరస్థాయిలో నిలిచిపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories