రీతూ, శ్రీజ లకు చుక్కలు చూపించిన ఫ్లోరా షైనీ.. భరణి కాళ్ళు మొక్కిన సుమన్ శెట్టి

Published : Sep 24, 2025, 11:19 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 17వ రోజు ఫ్లోరా షైనీ రెచ్చిపోయింది. సుమన్ శెట్టి, భరణి మధ్య భావోద్వేగ భరితమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

 కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 17వ రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బజర్ నొక్కిన వారికి వారి కుటుంబ సభ్యుల నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ వస్తుంది. తనూజ బజర్ నొక్కడంతో ఆమెకి కుటుంబ సభ్యుల నుంచి లెటర్ వచ్చింది. లెటర్ చదివిన తనూజ ఎమోషనల్ అయ్యారు. తాను బిగ్ బాస్ హౌస్ లో క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు తెలిపారు. 

25
శ్రీజ, ప్రియా మధ్య మనస్పర్థలు 

ఆ తర్వాత బజర్ నొక్కడం కోసం ప్రియా, సంజన, సుమన్ శెట్టి పోటీ పడ్డారు. ప్రియా, సంజనలలో ఎవరు ముందుగా బజర్ నొక్కారు అనే విషయంలో వివాదం జరిగింది. ప్రియా తానే బజర్ నొక్కానని చెబుతున్నప్పటికీ సంజన ముందుగా చేయి పెట్టినట్లు శ్రీజ భావించింది. దీనితో ప్రియా బాగా హర్ట్ అయింది. చివరికి శ్రీజ.. ప్రియాకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అప్పటికే మనస్తాపానికి గురైన ప్రియా తనకి అవసరం లేదని.. సంజన గారికే అవకాశం ఇవ్వాలని అలిగేసింది. బజర్ విషయంలో కూడా ఇలా గొడవ పెట్టుకుంటారా తూ అంటూ శ్రీజ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

35
తల్లి నుంచి లెటర్ అందుకున్న ప్రియా 

దీనితో ప్రియా, శ్రీజ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చివరికి ప్రియాకే అవకాశం దక్కింది. ప్రియాకి బిగ్ బాస్ మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకరు తన తల్లి నుంచి వచ్చిన లెటర్ అందుకోవడం, రెండవది తన తండ్రి నుంచి వచ్చిన మెసేజ్, మూడవది తన పెట్ ఫోటో.. ఈ మూడింటిలో ప్రియా తన తల్లి నుంచి వచ్చిన లెటర్ ఎంపిక చేసుకుంది. 

45
భరణి సీక్రెట్ బాక్స్ 

ఆ తర్వాత కిచెన్ లో సంజన, హరీష్ మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. టెనెంట్స్ ఎలా ఉండాలి అనే దానిపై చర్చ జరిగింది. దీనితో హరీష్ మాట్లాడుతూ టెనెంట్స్ అంటే బానిసలు కాదు, పనోళ్ళు అంతకంటే కాదు. బిగ్ బాస్ ఇచ్చిన రోల్ ప్రకారం ఉంటున్నాం అని సంజనకి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సుమన్ శెట్టి బజర్ నొక్కారు. సుమన్ శెట్టికి బిగ్ బాస్ వైవిధ్యమైన ఆప్షన్ ఇచ్చారు. భరణి దాచుకున్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయిస్తే.. నీ బ్యాటరీ పెరుగుతుంది అని బిగ్ బాస్ సుమన్ శెట్టికి తెలిపారు. 

55
చుక్కలు చూపించిన ఫ్లోరా షైనీ 

దీనితో సుమన్ శెట్టి భరణిని రిక్వస్ట్ చేశారు. అది తనకి ఎంతో సెంటిమెంట్ అయిన బాక్స్ అని, దానిని ఒక మంచి అకేషన్ లో ఓపెన్ చేద్దాం అని అనుకున్నట్లు భరణి తెలిపారు. కానీ ఈ రోజు సుమన్ శెట్టి కోసం దానిని ఓపెన్ చేస్తున్నట్లు భరణి హౌస్ మేట్స్ కి తెలిపారు. బాక్స్ ఓపెన్ చేసి తన తల్లికి సంబంధించిన లాకెట్ చూపించారు. భరణి బాక్స్ ఓపెన్ చేయడం తో సుమన్ శెట్టి బ్యాటరీ పెరిగింది. దీనితో సుమన్ శెట్టి ఎమోషనల్ అయి భరణి కాళ్లకు నమస్కరించారు. భరణి సుమన్ శెట్టిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ రీతూ చౌదరి, శ్రీజ, ఫ్లోరా షైనీ లకు బాస్కెట్ బాల్ తరహా గేమ్ ని బిగ్ బాస్ నిర్వహించారు. ఈ గేమ్ పేరు గురి తప్పకు. ముగ్గురు పోటీదారులు బాక్సెట్ బాల్స్ ని తమకి కేటాయించిన బాస్కెట్ లలో వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తె వాళ్ళు విజేతలు. విజేతగా నిలిచినా వారికి నామినేషన్స్ నుంచి ఇమ్మ్యూనిటీ లభిస్తుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ గేమ్ లో ఫ్లోరా షైనీ.. రీతూ, శ్రీజ లకు చుక్కలు చూపించింది. ఈ గేమ్ లో ఫ్లోరా షైనీ విజయం సాధించి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. 

Read more Photos on
click me!

Recommended Stories