
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వార్ 2 మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ డ్రాగన్ పైనే ఉన్నాయి. ఎన్టీఆర్ కి తన కెరీర్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. సూపర్ హిట్ డైరెక్టర్ తో సినిమా చేసిన ఎక్కువసార్లు తారక్ కి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. అల్లరి రాముడు నుంచి మొన్న రిలీజైన వార్ 2 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎన్టీఆర్ సూపర్ హిట్ డైరెక్టర్లతో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లాపులు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం.
ఆది లాంటి సంచలన మాస్ హిట్ తో ఆ టైంలో ఇండస్ట్రీలో తారక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో డైరెక్టర్ బి గోపాల్ నరసింహ నాయుడు చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. నరసింహ నాయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ టైంలో టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ లో బి గోపాల్ అగ్ర స్థానంలో ఉన్నారు. అలాంటి టైంలో ఎన్టీఆర్, బి గోపాల్ కాంబినేషన్ లో సినిమా పడితే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నరసింహ నాయుడు లాంటి మూవీ తర్వాత బి గోపాల్ నుంచి ఇలాంటి మూవీని ఫ్యాన్స్ అస్సలు ఆశించలేదు.
టాలీవుడ్ చరిత్రలో మాసివ్ హైప్ తో వచ్చిన చిత్రాల్లో ఆంధ్రావాలా కూడా ఒకటిగా ఉంటుంది. అంతకు ముందు పూరి జగన్నాధ్ ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన శివమణి మూవీ యావరేజ్ గా నిలిచింది. కానీ పూరి స్టామినాపై ఎవరికీ డౌట్ లేదు. ఎన్టీఆర్ తో పూరి తెరకెక్కించే తొలి చిత్రం ఆంద్రావాలా ఇండస్ట్రీ రికార్డులు తిరిగరాస్తుంది అని అంతా భావించారు. కానీ ఆంధ్రావాలా మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
టాలీవుడ్ లో మాస్ చిత్రాలని స్టైలిష్ గా తెరకెక్కించే దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. 2005 లో అతనొక్కడే చిత్రంతో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తన సోదరుడికి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. అతనొక్కడే తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశ పరిచింది.
అశోక్ తర్వాత సురేందర్ రెడ్డికి మరోసారి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ఊసరవెల్లి. అంతకు ముందే సురేందర్ రెడ్డి కిక్ లాంటి సూపర్ హిట్ చిత్రంతో మంచి జోష్ లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబోలో ఒక ఫ్లాప్ ఉంది. దీనితో సురేందర్ రెడ్డి ఈసారి ఎలాగైనా కసిగా వర్క్ చేసి ఎన్టీఆర్ కి హిట్ ఇస్తారు అని తారక్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈసారి కూడా రిజల్ట్ మారలేదు. ఊసరవెల్లి కూడా ఫ్లాప్ అయింది.
వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా లాంటి మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ మూవీతో బాలయ్య విజయాల దాహం తీరింది. సింహా తర్వాత బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో జతకట్టారు. రిలీజ్ కి ముందు దమ్ము చిత్రానికి ఊహించని హైప్ వచ్చింది. మాస్ చిత్రాలు తీసే బోయపాటి ఎన్టీఆర్ ని ఇంకెత మాస్ గా చూపిస్తారో అని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ దమ్ము కూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్ డిస్సప్పాయింట్మెంట్ గా మారిపోయింది.
పదేళ్ల పాటు హిట్ కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మెమొరబుల్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కి ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా. ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం వార్ 2. కనీవినీ ఎరుగని హైప్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రానికి ముందు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. కానీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లని పెట్టి తీసిన వార్ 2 మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.