ఏడుపు గురించి నువ్వు చెబుతున్నావా, తనూజని ఇరికించేసిన దివ్య.. ఇద్దరితో భరణి బంధం కట్

Published : Nov 03, 2025, 11:14 PM IST

బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హౌస్ లో బంధాలు పెంచుకున్న భరణి ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారు. తనూజ, దివ్యలతో ఇకపై తనకి సంబంధం లేదని తేల్చేశాడు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో  57వ రోజు నామినేషన్స్ టాస్క్ జరిగింది. ఎప్పటిలాగే ఇంటి సభ్యులు మాటల యుద్ధంతో ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. నామిషన్స్ కోసం బిగ్ బాస్ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. టెడ్డీ బేర్ బొమ్మలు ఒక చోట ఉంటాయి. వాటిని తీసుకుని పరిగెడుతూ తిరిగి ఇంటి సభ్యులు సేఫ్ జోన్ లోకి వచ్చేయాలి. చివరిగా వచ్చిన ఇంటి సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. 

25
తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం 

నామినేట్ అయిన ఇద్దరూ తమ బలాలు చెప్పుకుని సంచాలకుడిని కన్విన్స్ చేయాలి. ఫైనల్ గా వాళ్లిదరిలో ఎవరు వీక్ అని భావిస్తే సంచాలకుడు ఆ వ్యక్తిని నామినేట్ చేస్తాడు. మొదటి రౌండ్ లో సంజన నామినేట్ అయ్యారు. ఆ తర్వాత రౌండ్ లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ గొడవతో భరణి, తనూజ మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లు అయింది. హౌస్ లో ఉండడానికి తనూజ కన్నా నేనే బెటర్ అని భరణి అన్నారు. ఎందుకంటే తనూజని నేనే రెండుసార్లు సేవ్ చేశా. 

35
ఆ ఇద్దరితో భరణి బంధం కట్ 

తనూజ నన్ను ఒక్కసారి కూడా సేవ్ చేయలేదు. తనూజ వల్లే నేను హౌస్ నుంచి బయటకి వెళ్ళా. ఆ బాధ ఆమెకి కూడా తెలియాలి అని భరణి వ్యాఖ్యలు చేశారు. తనూజ కూడా స్ట్రాంగ్ పాయింట్స్ తో భరణికి కౌంటర్ ఇచ్చింది. సంచాలక్ గా ఉన్న దివ్య.. భరణినే నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో భరణి హర్ట్ అయ్యారు టాస్క్ ముసిగిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్లి.. ఇకపై మీరు నా టాపిక్ తీసుకురావద్దు. మీ గేమ్ మీరు ఆదుకోండి. మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశాడు. 

45
కెప్టెన్ కి ప్రత్యేక అధికారం 

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, తనూజ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. తనూజ సేఫ్ గేమ్ ఆడుతోంది అని ఇమ్మాన్యుయేల్ ఆరోపించాడు. కానీ చివరి వరకు సంచాలక్ ఎవరూ తనూజని నామినేట్ చేయలేదు. ఇక చివర్లో కెప్టెన్ అయిన దివ్యకి బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఇప్పటి వరకు నామినేట్ కానివారిలో ఒకరిని దివ్య నామినేట్ చేయాలి అని తెలిపారు. దీనితో దివ్య.. తనూజని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

55
తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది

అందుకు గల కారణాన్ని వివరించే క్రమంలో తనూజ, దివ్య మాటల తూటాలు పేల్చారు. తనూజ తనకి తాను ఏదేదో ఊహించుకుంటుంది. ఆమె ఓటమిని తీసుకోలేదు. భరణి గారు ఆమెకి దూరం కావడానికి కారణం నేనే అని అనుకుంటోంది. తనూజకి ప్రతి టాస్క్ లో ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి లేదా సింపతీ కావాలి. ప్రతి గేమ్ తర్వాత తనూజ ఏడుస్తూ కూర్చుంటుంది అని దివ్య కామెంట్స్ చేసింది. మొత్తంగా ఈ వారం సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ నామినేట్ అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories