బిగ్‌ బాస్‌ తెలుగు 9 `అగ్నిపరీక్ష`లో మతిపోయే రూల్స్.. అవి ఫాలో అయితేనే కంటెస్టెంట్లుగా ఛాన్స్

Published : Aug 19, 2025, 05:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 అగ్నిపరీక్ష త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన రూల్స్ ని వెల్లడించారు మాజీ కంటెస్టెంట్లు. ఈ సారి లెక్క వేరే లెవల్‌లో ఉండబోతుంది. 

PREV
16
కామన్‌ మ్యాన్‌ కోసం `అగ్నిపరీక్ష`

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` సందడి షురూ అయ్యింది. అసలు సందడికి ముందుగా ట్రీట్‌ ఇచ్చేందుకు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు రెడీ అయ్యారు. `అగ్నిపరీక్ష` పేరుతో మినీ షోని రన్ చేయబోతున్నారు. ఈ అగ్నిపరీక్షలో కామన్‌ మ్యాన్‌ కేటగిరీకి సంబంధించి ఐదుగురు కంటెస్టెంట్లని ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫైనల్‌ ఎంపిక జరుగుతుంది. అందుకోసం `అగ్నిపరీక్ష` అనే రౌండ్‌ ని నిర్వహిస్తున్నారు.

26
ఆ ముగ్గురి చేతుల్లో కామన్‌ మ్యాన్‌ కంటెస్టెంట్ల ఎంపిక

గతంలో బిగ్‌ బాస్‌ షోలోకి ఒకరు కామన్‌ మ్యాన్‌ వస్తే ఎక్కువ. కానీ ఈ సారి పబ్లిక్‌ నుంచి కంటెస్టెంట్లని ఎంపిక చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే ఆ మధ్య జనరల్‌ పబ్లిక్‌ నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇందులో వందల మంది పోటీపడ్డారు. మూడు, నాలుగు రౌండ్లలో చాలా మందిని ఫిల్టర్ చేసి ఫైనల్‌గా 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి ఐదుగురుని హౌజ్‌లోకి పంపించబోతున్నారు. వారి ఎంపికకి సంబంధించి ఈ `అగ్నిపరీక్ష` అనే టాస్క్ నిర్వహిస్తున్నారు. దీనికి ముగ్గురు జడ్జ్ లు ఉంటారు. నవదీప్‌, అభిజిత్‌, బిందుమాధవి జడ్జ్ లు గా వ్యవహరించబోతున్నారు.

36
ఆగస్ట్ 22 నుంచి `అగ్నిపరీక్ష` స్టార్ట్

ఆగస్ట్ 22 నుంచి ఈ `అగ్నిపరీక్ష` గేమ్‌ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్‌ 5 వరకు ఇది కొనసాగుతుంది. జియో హాట్‌ స్టార్‌లో దీన్ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ 15 మందిని ఈ ముగ్గురు జడ్జ్ లు జడ్డ్ చేయాల్సి ఉంటుంది. వీరికి అనేక టాస్క్ లు ఇస్తారు. గేమ్స్ పెడతారు. అనేక సవాళ్లని ఇస్తుంటారు. క్లిష్టసమయాలను క్రియేట్‌ చేస్తుంటారు. ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు. పరిస్థితులను ఎలా డీల్‌ చేస్తారు? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎవరితో ఎలా మాట్లాడతారు? ఇలాంటివన్నీ ఇందులో చూస్తారు. వాటిని బట్టి ఈ ఎంపిక జరుగుతుంది.

46
`అగ్నిపరీక్ష` లో గెలవాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

అయితే `అగ్ని పరీక్ష`లో టాస్క్ లకు సంబంధించిన మాజీ కంటెస్టెంట్లు సలహాలిస్తున్నారు. అగ్నిపరీక్షని ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో చెబుతున్నారు. మాజీ కంటెస్టెంట్‌ అర్జున్‌ కళ్యాణ్‌, అలాగే బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌ నిఖిల్‌ వంటి వారు ఈ మేరకు వీడియోలు విడుదల చేశారు. ఇందులో అర్జున్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, `బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చినప్పుడు నాకు తెలుసు ఇది అంతా ఈజీ కాదు అని, ఇందులో కొన్ని రోజులు స్వర్గంలా, మరికొన్ని రోజులు నరకంలా అనిపించిందని, మొత్తంగా చాలాస్పైసీగా ఉందని చెప్పారు. అయితే `అగ్నిపరీక్ష` మాత్రం డబుల్‌ స్పైసీగా ఉంటుందన్నారు. ముందు ఉండేది ముగ్గురు రూత్‌లెస్‌ జడ్జ్ లు అని, వాళ్లని ఇంప్రెస్‌ చేయాల్సింది స్వీట్‌ వర్డ్స్ తో కాదని, మీ హార్డ్ వర్క్, ఫైర్‌తో ఇంప్రెస్ చేయాలని తెలిపారు. ఇక్కడ టాస్క్ లు కూడా అంత ఈజీగా ఉండవని, మీ స్టామినా, మీ పేషెన్స్ ని, మీ తెలివితేటలను టెస్ట్ చేసేలా ఉంటాయని, ఒక తప్పుడు నిర్ణయం మిమ్మల్ని జడ్జ్ లు మాత్రమే కాదు, ఆడియెన్స్ కూడా జడ్జ్ చేస్తారని చెప్పారు అర్జున్‌.

56
గేమ్స్, తెలివి, స్టామినా

ఆయన ఇంకా చెబుతూ, బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి వెళ్లాలంటే ముందు ఈ అగ్నిపరీక్షని దాటాలని, ముగ్గురు జడ్జ్ లు మీ ఆటని, ప్రతి కదలికని వాచ్‌ చేస్తుంటారని, వాళ్లతోపాటు కామన్ ఆడియెన్స్ కూడా చూస్తుంటారని తెలిపారు అర్జున్‌ కళ్యాణ్‌. ఇందులో మీరు యాక్ట్ చేస్తే అందరి ముందు దొరికిపోతారు. కాబట్టి మీరు మీ నచ్చినట్టు ఉండాలని, జెన్యూన్‌గా ఉండాలని, నిజాయితీతో ఉండాలని తెలిపారు. లక్షల మంది జనాల్లో మీరు ఎంపికయ్యారంటే మీలో కచ్చితంగా ఫైర్‌ ఉంటుంది. ఆ ఫైర్‌ని బయటకు తీసుకొచ్చి గేమ్స్ లో, టాస్క్ లో చూపించాలని తెలిపారు. బిగ్‌ బాస్‌ అంటే గేమ్స్, టాస్క్ లు మాత్రమేకాదు, ప్రతి రోజు మీ ప్రవర్తన, మీరు ప్రతి రోజు మీ కంటెస్టెంట్లతో ఎలా ఉంటున్నారు, జడ్జ్ లతో ఎలా ఉంటున్నారు, మీరు ఒక్కళ్లే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారనేది ఇక్కడ కౌంట్‌ అవుతుందని, ఇదే మీకు నేనిచ్చే టిప్‌ అని వెల్లడించారు అర్జున్‌ కళ్యాణ్‌.

66
నోరుని అదుపులో పెట్టుకోవాల్సిందే

నిఖిల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మెంటల్లీ స్ట్రాంగ్‌ ఉండాలని, నోరుని అదుపులో పెట్టుకోవాలని తెలిపారు. ఇందులోకి వచ్చింది మీరు గేమ్‌ ఆడటానికి, మీకోసం మీరు ఆడటానికి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు నిఖిల్‌. ఈ సారి షోలో చాలా ట్విస్ట్ లు ఉండబోతున్నాయని తెలిపారు. క్యారెక్టర్‌ని, నిజాయితీ, తెలివికి సంబంధించిన సవాళ్లని ఫేస్‌ చేసి ఎవరైతే విన్‌ అవుతారో, వాళ్లే బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా అడుగుపెడతారని తెలిపారు నిఖిల్‌. ఆయన బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌కి విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలా బిగ్‌ బాస్ షోకి సంబంధించి ముందస్తుగా వచ్చే `అగ్నిపరీక్ష`కి ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మరి ఇవి ఆడియెన్స్ ని ఎలా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాయి. ఈ సారి సాధారణ ప్రజలకు సంబంధించి ఎవరెవరు హౌజ్‌లోకి అడుగుపెడతారో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories