40 ఏళ్ల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ మళ్ళీ కలిసి నటిస్తున్నారా?

Published : Aug 19, 2025, 03:50 PM IST

తమిళ సినిమాతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు రజినీకాంత్ కమల్ హాసన్. ఈ ఇద్దరు హీరోలు దాదాపు  40 ఏళ్ల తరువాత  కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నట్టు సమాచారం. 

PREV
14

సౌత్ స్టార్ సీనియర్ హీరోలు

సౌత్  సినిమాలో రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ దిగ్గజ నటులు. వీరిద్దరినీ సినిమాల్లోకి తీసుకొచ్చింది కె.బాలచందర్. ఆయన వీరిద్దరితో ఎన్నో సినిమాలు తీసి హిట్ కొట్టారు. రజినీ, కమల్ ఇద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి నటించారు. 15కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. కానీ 1985 తర్వాత ఇద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇద్దరూ కలిసి నటించకూడదని నిర్ణయించుకుని 40 ఏళ్లు అయ్యింది.

DID YOU KNOW ?
రాజ్యసభకు కమల్ హాసన్
ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నాడు కమల్ హాసన్. రీసెంట్ గా ఆయన డిఎంకే పార్టీ సపోర్ట్ తో రాజ్యసభలో ఎంపీగా అడుగు పెట్టాడు.
24

రజినీకాంత్, కమల్ హాసన్ తో లోకేష్ సినిమా

2020లో రజినీకాంత్, కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. దాని గురించి చర్చలు కూడా జరిగాయి. కానీ కరోనా వల్ల ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత లోకేష్ కమల్ తో విక్రమ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత లోకేష్ రజినీకాంత్ తో కూలీ సినిమా తీశారు. ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

34

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 సినిమా తీస్తారని అనుకున్నారు, కానీ ఇప్పుడు వేరే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారట. ఈ సినిమాని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.  ఇది నిజమైతే తమిళంతో పాటు సౌత్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది.

44

40 ఏళ్ల తరువాత మల్టీ స్టారర్ 

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై కొన్ని  విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి అంతకు మించిన సినిమా చేయాలని అనకున్నారట. అటు  కమల్ హాసన్ విక్రమ్ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కల్కీ సినిమా మాత్రం మంచి సక్సెస్ ను సాధించింది.  దాంతో ఈ ఇద్దరు స్టార్లు కలిసి మల్టీ  స్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.  ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేసి దాదాపు 40 ఏళ్లు అవుతోంది. ఇక  ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని అనుకుంటున్నారు. ఖైది 2 కంటే ముందే ఈ సినిమా పూర్తి చేయాలని లోకేష్ కనకరాజ్ అనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంతో తెలియల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories