ఆ బాధ తట్టుకోలేకపోయాను. అందులోంచి కోలుకోవడానికి నాకు చాలా టైమ్ పట్టింది. బయటకు రాలేకపోయాను.. డిప్రెషన్ లోకి వెళ్ళాను అన్నారు సీత. ఇక నాగార్జున కలుగచేసుకుని మరి అందులోంచి ఎలా బయటపడ్డావు.. అది చెపితే.. అందరికి మంచి చేసినదానివి అవుతావు అన్నారు. దాంతో తాను సైకియాట్రిస్ట్ ను కలిశానని. వారు ఒక్కటే అన్నారు. నీ గురించి ఎవరికైనా చెపితేనే కదా.. నీకు హెల్ప్ దొరికేది. ఎవరితో పంచుకోకపోతే.. నీకు సహాయం ఎవరు చేస్తారు అని అన్నారు,