మూడో వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే? ఆమెని టచ్‌ చేసేందుకు భయపడ్డారా? మణికంఠపై యష్మి కక్ష్య

First Published | Sep 16, 2024, 10:52 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారనేది లీక్‌ అయ్యింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో వారం శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని ఓట్ల ద్వారా కాకుండా హౌజ్‌మేట్స్ నిర్ణయం ఆధారంగా ఎలిమినేట్‌ చేయడం గమనార్హం. ఇలా జరగడం చాలా అరుదు.

అయితే ఇటీవలే శేఖర్‌ బాషాకి కొడుకు పుట్టాడు. ఆయన కొడుకుని చూడాలని ఉందని ఇతర హౌజ్‌మేట్స్ తో చెప్పడం వల్ల బిగ్‌ బాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై శేఖర్‌ బాషా స్పందిస్తూ అంతా ప్రేమతోనే తనని బయటకు పంపించారని తెలిపారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

ఇక మూడో వారం ప్రారంభమైంది. మూడో వారంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా నామినేషన్ల ప్రక్రియ వచ్చిందంటే హౌజ్‌మేట్స్ లో మరో యాంగిల్‌ కనిపిస్తుంటుంది. అప్పటి వరకు కూల్‌గా ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా అమ్మోరు అవతారం ఎత్తుతుంటారు. దీంతో ఒక్కసారిగా హౌజ్‌ హీటెక్కిపోతుంది.

ఈ క్రమంలో మూడో వారంలో కూడా అలానే జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో ఆవేశంతో ఊగిపోయారు. ప్రధానంగా మణికంఠపై యష్మి రియాక్ట్ అయిన తీరు షాకింగ్‌గా ఉంది. తన స్నేహాన్ని, నమ్మకాన్ని బ్రేక్‌ చేశావని, బిగ్‌ బాస్‌ షో మొత్తం నిన్ను నామినేట్‌ చేస్తానని తెలిపింది యష్మి. 
 


తాజాగా నామినేషన్లకి సంబంధించిన కంటెస్టెంట్ల లిస్ట్ లీక్‌ అయ్యింది. మూడో వారంలో ఎనిమిది మంది నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. వీరిలో విష్ణు ప్రియా, యష్మి, ప్రేరణ, అభయ్‌, పృథ్వీ, మణికంఠ, నైనిక, కిర్రాక్‌ సీత ఉన్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు వీళ్ల పేర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. 
 

ఇక ఇదే నిజమైతే ఈ సారి కూడా సోనియా నామినేషన్ నుంచి తప్పించుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఆమె నామినేషన్ నుంచి తప్పించుకుంది. అయితే ఆమెని నామినేట్‌ చేసేందుకు మిగిలిన కంటెస్టెంట్లు భయపడుతున్నట్టు తెలుస్తుంది. సోషల్‌ మీడియాలో ఇదే టాక్‌ నడుస్తుంది. అందుకే ఆమెని నామినేట్‌ చేయడం లేదని టాక్‌. నామినేషన్‌లో ఉంటే ఆమె ఎలిమినేషన్ పక్కా అంటున్నారు. మొత్తానికి సోనియా ఈ సారి కూడా తప్పించుకుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ఎనిమిది మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి. పృథ్వీరాజ్‌, సీత వీక్‌ కంటెస్టెంట్లుగా ఉన్నారు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 రెండు వారాల క్రితం(సెప్టెంబర్‌ 1)ని గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 14 మందితో ఈ షోని ప్రారంభించారు నాగార్జున. ప్రస్తుతం 12 మంది హౌజ్‌లో ఉన్నారు. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్‌ కాగా, రెండో వారం శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయ్యారు.

అయితే మధ్యలో `బిగ్‌ బాస్‌ తెలుగు 8 2.0 ఉంటుందని, మరో మిని ఓపెనింగ్‌ ఉంటుందని తెలుస్తుంది. ఐదు మంది మాజీ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారట. వారిలో శోభా శెట్టి, రోహిణి, అవినాష్‌, టేస్టీ తేజ, హరితేజ ఉన్నట్టు టాక్‌. 
 

Latest Videos

click me!