మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నది ఆ డైరెక్టర్‌తోనా? కథ కూడా వేరే, బాలకృష్ణ అసలు ప్లాన్‌ ఏంటంటే?

First Published | Sep 16, 2024, 9:15 AM IST

బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తేజని హీరోగా పరిచయం చేయడానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన అసలు ప్లాన్‌ వేరే ఉందా?
 

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు ఎంట్రీ అనౌన్స్ మెంట్‌ వచ్చింది. కొడుకు మోక్షజ్ఞ తేజని హీరోగా పరిచయం చేస్తున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది. దీనికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారడం విశేషం. మోక్షజ్ఞ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేశారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్స్ః సోనియా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ట్విస్ట్

మోక్షజ్ఞ హీరోగా సినిమా ప్రకటన సందర్భంగా ఓ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది టీమ్‌. ఇందులో స్లిమ్‌గా మారిన మోక్షజ్ఞ క్యూట్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. గతంలో ఆయన చాలా లావుగా ఉండేవాడు. కానీ తాజాగా ఆయన లుక్‌ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

సన్నగా మారి తన డెడికేషన్‌ని చాటి చెప్పాడు. ఈ లుక్‌ బాగా వైరల్ అయ్యింది. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఇలా అంతా ఈ లుక్‌ని వైరల్‌ చేశారు. దీనికి విశేష స్పందన లభించడం విశేషం. 
 


మోక్షజ్ఞ హీరోగా ఓ మైథలాజికిల్‌ సోషియా ఫాంటసీతో సినిమాని చేయబోతున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తాను తీసిన `హనుమాన్‌` తరహాలోనే ఈ మూవీ కూడా ఉంటుందని సమాచారం. ప్రస్తుత అంశాలకు మైథలాజికల్‌ టచ్‌ ఇస్తూ చేయబోతున్నారట. ఇదే ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది.

త్వరలోనే సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇక మోక్షజ్ఞ గత రెండేళ్లుగా తన వర్కౌట్స్ విషయంలో దృష్టి పెట్టాడు. బాగా బరువు తగ్గాడు. అదే సమయంలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారట. వైజాగ్‌ సత్యానంద్‌ వద్దనే ట్రైన్ అయినట్టు సమాచారం. ఫస్ట్ లుక్‌లో క్యూట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉన్న మోక్షజ్ఞ వెండితెరపై ఎలా సందడి చేస్తాడనేది ఆసక్తికరం. 
 

ఇదిలా ఉంటే తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయానికి సంబంధించి బాలకృష్ణ అసలు ప్లాన్‌ వేరే ఉంది. ముందు ప్రశాంత్‌ వర్మ తన మైండ్‌ లేడు. తాను అనుకున్నది సింగీతం శ్రీనివాసరావు చేతుల మీదుగా మోక్షజ్ఞని పరిచయం చేయడం. అంతేకాదు బాలయ్య, సింగీతం కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ `ఆదిత్య 369`కి సీక్వెల్‌గా ఈ మూవీ చేయాలనుకున్నారు. `ఆదిత్య 999` పేరుతో తెరకెక్కించాలని ఉందని బాలయ్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. 
 

దీనికి సంబంధించిన ఓ స్క్రిప్ట్ కూడా తన వద్ద ఉందట. కథని కూడా తానే స్వయంగా రెడీ చేశాడట బాలయ్య. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఓ దశలో తానే డైరెక్ట్‌ చేయాలనుకున్నాడట. `ఆదిత్య 999`ని పౌరాణిక మూవీగా చేయాలని, తాను మెయిన్‌ హీరోగా నటించి, కొడుకు పాత్రలో మోక్షజ్ఞని పరిచయం చేయాలని భావించాడట.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయం చెప్పారు. అయితే దీనికి గురించి ఆలోచిస్తున్నానని, ఎలా చేయాలనేది ప్లాన్‌ చేస్తానని తెలిపారు. కానీ ఈ లోపు లెక్కలన్నీ మారిపోయాయి. సడెన్‌గా ట్రాక్‌లోకి ప్రశాంత్‌ వర్మ వచ్చాడు. 
 

ప్రశాంత్‌ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞని పరిచయం చేయడానికి ప్రధానం కారణం `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే`. ఈ టాక్‌ షోని ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్ చేశాడు. అప్పుడే ప్రశాంత్‌ వర్మ వర్క్ ఏంటో స్వయంగా చూశాడు బాలయ్య. ఆయన డిజైన్‌ చేసిన కాన్సెప్ట్ లకు ఫిదా అయ్యారు.

ఆ షోకి తేజస్విని కూడా వర్క్ చేసింది. దీంతో ప్రశాంత్‌ ఏంటో ఆమె కూడా గమనించింది. దీంతో ఈ ఇద్దరు అభిప్రాయంతో ప్రశాంత్‌ వర్మతోనే మోక్షజ్ఞని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారట.

దీనికితోడు ఈ ఏడాది `హనుమాన్‌` చిత్రంతో పెద్ద బ్లాక్‌ బస్టర్ కొట్టాడు ప్రశాంత్‌ వర్మ. ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి ఇది ఏకంగా మూడు వందల కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కి గురి చేసింది. దీంతో దర్శకుడిపై నమ్మకం మరింత పెరిగింది.

పైగా ఆయన చెప్పిన కథ కూడా అలానే ఉండటంతో ఇక మరో ఆలోచన లేకుండా రంగంలోకి దిగినట్టు సమాచారం. మరి మోక్షజ్ఞ పరిచయం మూవీ ఎలా ఉంటుంది, ఆయన వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి. అన్నట్టు దీనికి `సింబా` అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు సమాచారం. 

Latest Videos

click me!