12వ వారం హౌస్ నుండి యాంకర్ రవి (Anchor ravi) ఎలిమినేట్ కాగా... ప్రేక్షకులలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన ఫ్యాన్స్ చివరికి నిరసనలకు కూడా దిగారు. రవి ఎలిమినేషన్ వాస్తవికత లేదని, నిర్వాహకులు ఓట్లతో సంబంధం లేకుండా రవిని కావాలనే ఎలిమినేట్ చేశారని ఆరోపిస్తున్నారు. వీరి వాదనలో నిజం ఉందనిపిస్తుంది. కారణం సిరి, ప్రియాంక, కాజల్ కంటే కూడా రవికి తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మడం కష్టమే.