బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి త్వరలో కత్రినా పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, కత్రినా వివాహం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. కత్రినా కెరీర్ లో ప్రేమ వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి.