Bigg boss telugu 5: నామినేషన్స్ లో ఆ ఏడుగురు... రవి, శ్రీరామ్, ప్రియలతో పాటు టాప్ కంటెస్టెంట్స్

First Published | Oct 19, 2021, 12:42 AM IST

ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. సక్సెస్ ఫుల్ గా 7వ వారంలో అడుగుపెట్టింది. Bigg boss హౌస్ లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

మొదటి నుండి మానస్ అంటే ప్రేమ చూపిస్తున్న ప్రియాంక... అతడు తనకు అన్నం తినిపించలేదని నొచ్చుకుంది. ఈ విషయం సన్నీతో చెప్పి బాధపడింది. మనం నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కళ్ళలో మన బాధకనిపిస్తుందని... మానస్ తనను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంది. ఈ విషయాన్ని సన్నీ Manas తో చెప్పగా.. ఆడవాళ్ళ గురించి నాకు తెలియదని, అందుకే మూడు బ్రేకప్స్ అయ్యాయని అన్నాడు. తనకు అర్థం అయ్యేలా నీ గురించి చెప్పాలే అని సన్నీ మానస్ తో అన్నాడు. 
 

ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈసారి Nominations ప్రక్రియని బిగ్ బాస్ భిన్నంగా నిర్వహించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు కంటెస్టెంట్స్ ముఖాలతో కూడిన కోతుల బొమ్మలు ఏర్పాటు చేశారు. కంటెస్టెంట్స్ నుండి సన్నీ, శ్రీరామ్, జస్వంత్ లను వేటగాళ్లుగా నియమించాడు. బజర్ మోగిన వెంటనే వేటగాళ్ళు ముగ్గురు గార్డెన్ ఏరియాలో పరుగెఎత్తుకు రావాలి. ముందుగా వచ్చిన వేటగాడు కంటెస్టెంట్స్ వాదన విని నామినేట్ చేయాలి. అలాగే బజర్ మోగిన వెంటనే లివింగ్ రూమ్ లో ఉన్న రెండు అరటిపళ్ళ కోసం కంటెస్టెంట్స్ పోటీపడాలి. అరటి పళ్ళు దక్కించుకున్న ఇద్దరు.. వేటగాడికి తగు కారణాలు చెప్పి ఇతరులను నామినేట్ చేయాల్సి ఉంటుంది.


ఈ టాస్క్ లో ఎక్కువ సార్లు గార్డెన్ ఏరియాలోకి పరుగెత్తుకొచ్చిన వేటగాడు సేవ్ అవుతాడు. మిగిలిన ఇద్దరు నామినేట్ అవుతారు. ఎక్కువ సార్లు Sunny...  శ్రీరామ్, జస్వంత్ కంటే ముందు గార్డెన్ ఏరియాలోకి రావడం జరిగింది. దీనితో అతడు సేవ్ అయ్యాడు. 

ఇక కంటెస్టెంట్స్ చెప్పే కారణాల ఆధారంగా నామినేట్ చేయాల్సిన బాధ్యత వేటగాడిపై ఉండగా.. ప్రియ చెప్పిన రీజన్ కి నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని Ravi, సన్నీతో గొడవకు దిగాడు. అయినా ఇది నా గేమ్ అంటూ సన్నీ కన్విన్స్ కాలేదు. నామినేషన్స్ ప్రక్రియలో ప్రియాంక సైతం కన్నీరు పెట్టుకుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వ్యక్తులతో ఉండాలని అనిపించడం లేదని ఏడ్చేసింది. 
 

నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులను బిగ్ బాస్ ప్రకటించారు. వేటగాళ్లు గా సన్నీ సేవ్ కాగా, జస్వంత్, శ్రీరామ్ నామినేట్ అయ్యారు. అలాగే కాజల్, సిరి, అని మాస్టర్, ప్రియ లతో పాటు సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో కూడా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. 
 

మొత్తంగా హౌస్ నుండి ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. 19మంది కంటెస్టెంట్స్ నుండి సరయు, ఉమాదేవి, హమీద, లహరి, నటరాజ్ మాస్టర్, శ్వేత ఎలిమినేట్ కావడం జరిగింది.

Also read మొదటిసారి కొడుకు ఫోటోని ఫ్యాన్స్ తో పంచుకున్న యాంకర్ సమీరా!

Also read అనసూయ బట్టలపై కోటా ఘాటు వ్యాఖ్యలు... బోల్డ్ యాంకర్ ఊరుకుంటుందా... పెద్దవాడని కూడా చూడకుండా ఇచ్చిపడేసింది!

Latest Videos

click me!