రహస్యంగా రెండో వివాహం చేసుకున్న నటి సురేఖ?... ఆ ఫోటోలు బయటపడడంతో తెరపైకి పలు అనుమానాలు!

First Published | Oct 18, 2021, 6:35 PM IST

నటి సురేఖ వాణి రెండో వివాహం చేసుకున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మెడలో తాళిబొట్టుతో ఆమె కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. 
 

భర్త మరణం తరువాత కూతురు సుప్రీత తో Surekha vani ఒంటరిగా ఉంటున్నారు. టీనేజ్ వయసులో ఉన్న సుప్రీత తల్లి సురేఖతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీ అయినా, విహారం అయినా ఇద్దరూ కలిసి జరుపుకుంటారు. ఈ తల్లీ కూతుళ్ళ డాన్స్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. 

భర్త మరణం తరువాత కూతురు సుప్రీత తో Surekha vani ఒంటరిగా ఉంటున్నారు. టీనేజ్ వయసులో ఉన్న సుప్రీత తల్లి సురేఖతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీ అయినా, విహారం అయినా ఇద్దరూ కలిసి జరుపుకుంటారు. ఈ తల్లీ కూతుళ్ళ డాన్స్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.


ఆ మధ్య సురేఖ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ, వరుస కథనాలు హల్చల్ చేశాయి. సింగర్ సునీత మాదిరి సురేఖ వాణి సైతం రెండో పెళ్లి ఆలోచనలో ఉన్నారంటూ కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలను సురేఖా వాణి కొట్టిపారేశారు. 

సురేఖా కూతురు సుప్రీత అయితే మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరాధారమైన వార్తలు రాసి.. వ్యక్తుల జీవితాలతో ఆడుకోవద్దని, మీ స్వలాభం కోసం మాపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి తేవద్దని Suprita గట్టి వార్నింగ్ ఇచ్చారు. దానితో సురేఖ పెళ్లి వార్త చల్లబడింది. 

తాజాగా సురేఖ మెడలో తాళిబొట్టుతో కనిపించడంతో మరోమారు పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. సురేఖ సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలలో మెడలో తాళిబొట్టుతో కనిపించారు. దీనితో సురేఖ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

మెడలో తాళిబొట్టు ఉన్నంత మాత్రాన  వివాహం చేసుకున్నారన్న అభిప్రాయానికి రాకూడదని మరికొందరు వాదిస్తున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా కూడా తాళిబొట్టు ధరించి ఉండవచ్చన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో క్లారిటీ రావాలంటే వేచి చూడాలి, లేదంటే సురేఖ స్వయంగా నోరువిప్పాలి. 
 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమెడియన్ గా సురేఖ వాణి సౌత్ లో అనేక చిత్రాలు చేశారు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలలో సురేఖ వాణి పాత్రలు గుర్తుండిపోతాయి. రెడీ, దుబాయ్ శీను, నమో వెంకటేశా చిత్రాలలో సురేఖ కమెడియన్ గా ప్రేక్షకులు హాస్యం పంచారు. 

Also read మళ్ళీ డుమ్మా కొట్టిన జాక్వెలిన్..ఈడీతోనే గేమ్స్, రూ.200 కోట్ల స్కామ్ కేసులో అంత ధైర్యం ఏంటి!

Also read ఆ లిస్ట్ లో రష్మిక - సమంత! అందరూ షాక్

Latest Videos

click me!