అనసూయ బట్టలపై కోటా ఘాటు వ్యాఖ్యలు... బోల్డ్ యాంకర్ ఊరుకుంటుందా... పెద్దవాడని కూడా చూడకుండా ఇచ్చిపడేసింది!

First Published | Oct 18, 2021, 8:54 PM IST


సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. ముక్కుసూటిగా ఉంటున్న ఆయన భావాలు కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై ఆయన చేసిన నెగిటివ్ కామెంట్స్ వైరల్ కావడం జరిగింది. 
 

ఇక కోటా వ్యాఖ్యలపై Anasuya స్పందించారు.సోషల్ మీడియా వేదికగా  వరుస ట్వీట్స్ తో కోటాకు గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడవాళ్లు ఎలాంటి బట్టలు ధరించాలో నిర్ణయించే మగాళ్లు మనసులు మలినమయ్యాయి. వాళ్ళు బలహీనమైన ఆలోచనలు కలిగివున్నారు, అంటూ కోటా వ్యాఖ్యలు కౌంటర్ విసిరారు. 
 

ఇక కోటా వ్యాఖ్యలపై Anasuya స్పందించారు.సోషల్ మీడియా వేదికగా  వరుస ట్వీట్స్ తో కోటాకు గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడవాళ్లు ఎలాంటి బట్టలు ధరించాలో నిర్ణయించే మగాళ్లు మనసులు మలినమయ్యాయి. వాళ్ళు బలహీనమైన ఆలోచనలు కలిగివున్నారు, అంటూ కోటా వ్యాఖ్యలు కౌంటర్ విసిరారు. 
 


ఈ తరం మగాళ్లు కనీసం తన భావం అర్థం చేసుకుని సప్పోర్ట్ చేస్తారని భావిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. పెద్దరికం అనేది వయసుతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. నటుడిగా కోటా గారు అంటే నాకు గౌరవం, విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు. వ్యక్తిగా ఆయన ఆలోచనలు, కామెంట్స్ చాలా చీఫ్ గా ఉన్నాయి.. అని అనసూయ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. 

అనసూయ ట్వీట్స్ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతూ.. కోటాను తప్పుబడుతుంటే, మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. కోటా కేవలం తన అభిప్రాయం వెల్లడించారని, అంత మాత్రాన ఈ స్థాయిలో విమర్శించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే సమయంలో అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

జబర్దస్త్ షోలో అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ అనేకమార్లు వివాదాస్పదం అయ్యింది. పలువురు ఆమె పొట్టి బట్టలపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. సదరు విమర్శలకు అనసూయ ఘాటు రిప్లై ఇవ్వడం జరిగింది. నా బట్టలు నా ఇష్టం... నేను ఏమి ధరించాలో చెప్పడానికి మీరు ఎవరని అనసూయ అంటారు. 
 

ఆడవాళ్లు ధరించే బట్టలను బట్టి వ్యక్తులను జడ్జి చేయడం తప్పన్న అభిప్రాయం ఆమె వెల్లడిస్తున్నారు. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎటువంటి బట్టలైనా ధరిస్తా అంటారు అనసూయ. మరో జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీపై ఈ తరహా విమర్శలు రాకపోవడం విశేషం. 

నిజానికి Rashmi gautam కూడా ఆ షోలో కురచ దుస్తులు ధరిస్తారు. విమర్శలు మాత్రం అనసూయనే చుట్టుముడతాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కామెంట్ కి అనసూయ స్పందిస్తారు. రష్మీ అలాంటి కామెంట్స్ లైట్ తీసుకుంటారు. అందుకే రష్మీ ఇలాంటి వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు లేవు.

Also read నువ్విక్కడ లేకున్నా భయంగా ఉంది.. నాపై అంత అధికారం ఎవరిచ్చారు, సమంత పోస్ట్ వైరల్

Also read మంచు లక్ష్మీ దారుణంగా ట్రోలింగ్‌.. నెటిజన్లకి నటి దిమ్మతిరిగే కౌంటర్‌.. నెట్టింట వైరల్‌

Latest Videos

click me!