వాళ్ళిద్దరి ఇష్టం తెలుసుకుని,ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేస్తాం.. దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ తల్లి సంచలనం

First Published | Oct 28, 2021, 1:50 PM IST

యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఒకరి గుర్తులు మరొకరు ఒంటిపై శాశ్వత టాటూలుగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ కోసం బయట క్యాంపైన్ చేస్తుంది దీప్తి. 

షణ్ముఖ్ సైతం Bigg bossహౌస్ లో మాటల్లో మాటగా, దీప్తితో తన రిలేషన్ బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాలకు షణ్ముఖ్ మదర్ ఉమా రాణి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 
 

దీప్తి, Shanmukh పెళ్లి గురించి మాట్లాడుతూ.... వారిద్దరూ కేవలం మిత్రులు మాత్రమే, వాళ్ళు లవర్స్ అని నేను అనుకోవడం లేదు. ఇద్దరిదీ మంచి జంట, కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఒకవేళ వాళ్లకు ఇష్టం అయితే పెళ్లి చేస్తాం. 
 



Deepthi sunaina, షణ్ముఖ్ వాళ్ళ రిలేషన్ గురించి ఏమనుకుంటున్నారో అడిగి, పెళ్లి చేసుకుంటాం అంటే, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వివాహం చేస్తాం. అయినా వాళ్లకు ఇంకా వివాహం చేసే వయసు కూడా రాలేదంటూ, ఉమా రాణి క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటాం అంటే, మాకు అభ్యంతరం లేదని పరోక్షంగా ఆమె తెలిపారు. 

ఇక షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ, హౌస్ లో సిరి, షణ్ముఖ్ కలిసి గేమ్ ఆడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు. వారిద్దరూ కలిసి ఒకే చోట పనిచేశారు. దాని వలన వారి మధ్య చనువు ఉంది.  ఎవరి గేమ్ వాళ్లదే అనే విషయం త్వరలో అందరికీ అర్థం అవుతుంది.. అని Umarani అన్నారు. 

మొదటిసారి బిగ్ బాస్ నిర్వాహకుల నుండి షణ్ముఖ్ కి కాల్ వచ్చింది. సీజన్ 4లో షణ్ముఖ్ పాల్గొంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి, అది నిజం కాదు. ప్రస్తుతం షణ్ముఖ్ బాగా ఆడుతున్నాడు,Bigg boss telugu 5 టైటిల్ విన్నర్ అవుతారని అంటున్నారు. ఆ విషయం సంతోషాన్ని కలిగిస్తుందని ఉమారాణి తెలిపారు. 

ఇటీవల షణ్ముఖ్ తన తల్లి గురించి మాట్లాడుతూ.. క్యాన్సర్ ని ఎదిరించి నిలిచిన మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పడం జరిగింది. మొత్తంగా యూట్యూబ్ ప్రేమ జంట షణ్ముఖ్, దీప్తి వివాహంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది ఉమారాణి.

Also read హమీద టాపిక్‌ తీసిన షణ్ముఖ్‌.. మండిపోయిన సిరి.. సారీ చెప్పమంటే గట్టిగా హగ్‌..

Also read Rashmika mandanna:పైట తీసేసి నడుము, నాభీ చూపిస్తూ రష్మిక రచ్చ... ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

Latest Videos

click me!