కామంతో కళ్ళుమూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జా ఏం ఉండవ్... వాళ్ళను బూతులు తిడుతూ వీడియో పోస్ట్ చేసిన అషురెడ్డి!

First Published Nov 11, 2022, 4:17 PM IST

నేను ఎలాంటి బట్టలేసుకుంటే మీకేంటి... నచ్చితే చూడండి. లేదంటే నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి. అంతే కానీ విమర్శించే హక్కు మీకు లేదు. అయినా వల్గారిటీ మా బట్టల్లో కాదు మీ దృష్టిలో ఉందంటూ నేరం విమర్శించే వాళ్ళ మీదకు నెట్టేస్తున్నారు. 
 

Ashu Reddy

అనసూయ ఈ ఫార్ములా చాలా కాలంగా వాడుతున్నారు. అనసూయ డ్రెస్సింగ్ ని ఎవరైనా తప్పుబడితే వాళ్లకు మూడిందే. నాకు కంఫర్ట్ అనిపిస్తే బికినీ కూడా వేసుకుంటా అంటుంది. అసలు నేను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పడానికి మీరెవరు. పక్కకు దొబ్బేయ్ అంటుంది. 
 

Ashu Reddy

ఈ కోవలోకే వచ్చింది బిగ్ బాస్ భామ అషురెడ్డి. ఇంస్టాగ్రామ్ వేదికగా అషురెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె బట్టల సైజ్ మరీ తగ్గిపోయింది. మితిమీరిన ఎక్స్ఫోజింగ్ తో జనాలను పండగ చేసుకోండి అంటుంది. స్కిన్ షోలో అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసింది. దీంతో ఒక వర్గం ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

Ashu Reddy


ఇటీవల పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ ధరించి బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోస్ వైరల్ కాగా నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. రాయలేని భాషలో తిడుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. బూతు సినిమాలు చేసుకో థూ అంటూ పచ్చి గా దుమ్మెత్తి పోశారు. బహుశా ఈ కామెంట్స్ అషురెడ్డి చదివి హర్ట్ అయినట్లున్నారు. 

Ashu Reddy

తన హాట్ ఫోటోలను విమర్శిస్తూ కామెంట్స్ పోస్ట్ చేసిన వారిని ఉద్దేశిస్తూ ఓ వీడియో చేసింది. ఓ సినిమాలో నటి రమాప్రభ చెప్పిన ''కామాం తురాణం నఃభయం నః లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఉండదు,'' అనే డైలాగ్ తో వీడియో చేసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Ashu Reddy

తన ఫోటోలపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని ఆమె కామాంధులతో పోల్చింది. మీరు తప్పుడు దృష్టితో చూడటం వలనే నా ఫోటోలు అలా కనిపిస్తున్నాయి. నేను బట్టలు మార్చడం కాదు మీ బుద్ధి మార్చుకోండని పరోక్షంగా సెటైర్ వేసింది. మొత్తంగా నేనేమీ తప్పు చేయడం లేదు, కాబట్టి స్కిన్ షో చేయడంలో తగ్గేదే లేదని హింట్ ఇచ్చింది.

Ashu Reddy

ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారింది. అప్పటి నుండి ఈ ట్రెండ్ ఎక్కువైంది. హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. అషురెడ్డి లాంటి అరాకొరా సంపాదన కలిగిన వాళ్ళు మరింత తెగించి అందాల ప్రదర్శనే పనిగా పెట్టుకుంటున్నారు. 
 

click me!